మార్కెట్ లో కొత్తమ్మాయి రేటు రూ.240 కోట్లు ఇంత రేటు ఎందుకో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

730

బాలీవుడ్ లో గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా హీరోలు హీరోయిన్లుగా తార‌ల వార‌సులు సంద‌డి చేస్తున్నారు..ఖాన్స్ క‌పూర్స్ ఫ్యామిలీల నుంచి వార‌సులు బాలీవుడ్ తెర‌పై సంద‌డి చేస్తున్నారు అనే చెప్పాలి.. ఇప్పుడు బీటౌన్ లో వీరిచిత్రాలు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాయి.
ఈ కోవ‌లో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ డాటర్ సారా అలీ ఖాన్… ఆమె నటించిన మొదటి సినిమా ‘కేథార్ నాథ్’ కి హిట్ టాక్ రానప్పటికీ హీరోయిన్ గా సారాకి మంచి మార్కులే పడ్డాయి.

Image result for సారా

నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న సారా రీసెంట్ గా ‘సింబా’ చిత్రంతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సారా నటించిన ఈ రెండు సినిమాల థియేట్రికల్ వేల్యూయేషన్ రెండు వందల నలభై కోట్లు పలికిందట.దీంతో ఆమె మార్కెట్ చాలా ఎక్కువ‌గా ఉంది అని నిర్మాత‌లు ద‌ర్శ‌కులు ఆమెకోసం క్యూ కడుతున్నారు.. అలాగే ల‌వ్ ఓరియెండెడ్ చిత్రాల కోసం ఆమె ద‌గ్గ‌ర సైన్ చేయించుకునేందుకు, ద‌ర్శ‌కులు ఎదురుచూస్తున్నారు, అయితే ఆమె త‌న త‌దుప‌రి చిత్రాల పై ఆచితూచి అడుగు వేయాల‌ని ఆలోచిస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

స్టార్ హీరోయిన్ల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ ఫిగర్ ని కెరీర్ ఆరంభంలోనే సాధించింది ఈ బ్యూటీ… ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లకు పెళ్లిళ్లు అయిపోవడం, కత్రినా లాంటి హీరోయిన్లకు హిట్లు లేకపోవడం, అలియా భట్ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుండడంతో ఇప్పుడు దర్శక నిర్మాతలకు కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గా సారా రూపంలో మంచి ఆప్షన్ దొరికింది..ప్రస్తుతం ఆమెను సంప్రదించే నిర్మాతల సంఖ్య పెరుగుతోందట. ఆమె మాత్రం తన బాధ్యతలు మొత్తం కరణ్ జోహార్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. మ‌రి అంద‌రికి క‌ర‌ణ్ జోహ‌ర్ అంటే అభిమానం. ఆయ‌న లాంచ్ చేసిన వారు అంద‌రూ నేడు బాలీవుడ్ లో ఎంతటి పొజిష‌న్లో ఉన్నారో తెలిసిందే.. మ‌రి ఈ భామ నిర్ణ‌యాల‌పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.