మంచు మనోజ్ భార్య ప్రణతి గురించి షాకింగ్ నిజాలు

2253

ప్రేమించిన అమ్మాయితో జీవితం పంచుకోవటం అనేది చాలా కొద్దీ మందికి మాత్రమే దక్కుతుంది. టాలీవుడ్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఈ అదృష్టానికి నోచుకున్నాడని చెప్పాలి. మనోజ్ తన మనసుకు నచ్చిన ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు.. రెండు సంవత్సరాల డేటింగ్ చేసి 2015 లో మనోజ్ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. మంచు మనోజ్ లో ఒక ప్రేమికుడు ఉన్నాడన్న సంగతి ఇంటిలోని వారికీ చాలా రోజులకు తెలిసిందట. అయితే ఇప్పుడు ఈ వివాహ బంధం విడిపోయింది. తనకు తన భార్యకు విడాకులు అయ్యాయని బరువెక్కిన గుండెతో చాలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు మంచు మనోజ్.

మంచు మనోజ్ మాజీ భార్య ప్రణతి ఎవరో కాదు మంచు విష్ణు భార్య విరోనికా క్లాస్ మెట్. ఇద్దరు కలిసి అమెరికాలో చదువుకున్నారు. ప్రణతి CA చేసింది. వదిన ద్వారా పరిచయం అయినా ప్రణతి మనోజ్ ని ఎంతగానో ఆకర్షించింది. మనోజ్ తో ప్రణతి రెండు సంవత్సరాలు డేటింగ్ చేసి చివరకు మూడు ముళ్ళు వేయించుకుంది. ప్రణతి తల్లితండ్రులు చాలా కాలం కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. కులం వేరు అయినా సరే మోహన్ బాబు వంటి నట దిగ్గజంతో వియ్యం అందటం తమ అదృష్టంగా భావించి పొంగిపోయారు ప్రణతి తల్లితండ్రులు. మోహన్ బాబు ప్రణతిని మూడో కూతురిగా చూసుకుంటానని చెప్పి మరింత సంతోషాన్ని కలిగించాడు ప్రణతి తల్లితండ్రులకు. ఇక పెళ్లి తర్వాత ప్రణతి రెడ్డి మనోజ్ ని పూర్తిగా కంట్రోల్ చేసిందని మనోజ్ స్నేహితులు చెప్పుతూ ఉంటారు. సాయంత్రం అయితే ఫోన్ ముట్టుకోకూడని భార్య కండిషన్ పెట్టిందనే వార్త మనోజే స్వయంగా వెల్లడించాడు. గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు బయటకు వెళ్లడం ఇష్టం లేని మనోజ్ తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో వాళ్లిద్దరూ విడిపోయారు అని వచ్చిన వార్తలు రూమర్స్ అని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నాం అని చెప్పడంతో అందరు షాక్ కు గురవుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక వీరిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వ‌చ్చింద‌న్న దానిపై ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టి నుంచో గుస‌గుస‌లు ఉన్నాయి. మనోజ్ సినిమారంగంలో హీరోగా బిజీబిజీగా ఉండ‌డం ప్ర‌ణ‌తికి పెద్దగా నచ్చలేదని ఆ విషయంలో తరచూ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తటం చిన్న చిన్న విషయాలే చివరకు పెద్దవి కావడంతో వీరు విడిపోక తప్పలేదు అని తెలుస్తోంది. ఇక చాలా రోజుల క్రిందటే ప్రణతి అమెరికా వెళ్ళిపోయి తల్లితండ్రుల వద్ద ఉంటుంది. వీరిని కలిపేందుకు అటు ప్ర‌ణ‌తి కుటుంబ సభ్యులతో పాటు ఇటు మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాకపోవడంతో చివరకు విడిపోక‌ తప్పలేదు. ఇక మంచు మనోజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేవు. అలాగే సినిమాలు ఏమి కూడా చేతిలో లేవు. ఈ ప్రభావం వ్యక్తిగత జీవితం మీద పడింది.

ఈ క్రింద వీడియో చూడండి