తులసి సినిమాలో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా..ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి

2530

టాలీవుడ్ లో ఛైల్డ్ ఆర్టిస్ట్ లకు మంచి భవిష్యత్ ఉంటుంది.ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది.చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి స్థానానికి ఎదిగారు.అలా ఎదిగిన వారిలో మాష్టర్ అతులిత్ కూడా ఒకరు.వెంకటేష్ నయనతార కలిసి నటించిన తులసి సినిమా చుసిన ప్రతి ఒక్కరికి వెంకటేష్ కొడుకుగా నటించిన పిల్లడు అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది.అంతలా వెంకటేష్ కొడుకుగా నటించి మెప్పించాడు.ఈ సినిమాలో అతులిత్ చేసిన నటనను అందరు మెచ్చుకున్నారు.ముద్దు ముద్దు మాటలతో అందరిని కట్టి పడేసిన ఆ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం.

Related image

 

అతులిత్ తులసి సినిమా తర్వాత నచ్చావులే రక్ష శ్రీరామరాజ్యం లాంటి సినిమాలలో నటించాడు.చూడగానే ఎవరైనా ఆకర్షితులు అయ్యే అందం అతులిత్ సొంతం.చదువుకుంటున్న సమయంలో సినిమా ఆడిషన్స్ కోసం అని అతులిత్ పేరెంట్స్ ఫోటోలు పంపిస్తే ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి తులసి సినిమాలో నటించాడు.అలా తల్లిదండ్రుల ప్రొత్బలంతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటనతో మరిన్ని అవకాశాలు దక్కించుకున్నాడు.సినిమాలలో అల్లరిపిల్లాడిలా కనిపించే అతులిత్ నిజ జీవితంలో మాత్రం చాలా సైలెంట్ అంటా. ఇంట్లో తన పని తాను చేసుకుపోతాడు.అలాగే సినిమాలలో నటిస్తు చదువును నెగ్లెట్ చెయ్యకుండా వచ్చాడు.ఇండస్ట్రీలో ఉండే అందరు హీరోలు తనకు ఇష్టం అని చెప్పుకొచ్చాడు.అందరి కంటే వెంకటేష్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంటా.ఇక హీరోయిన్స్ లలో నయనతార అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంటా.తులసి సినిమా మొదటిది కాబట్టి ఆ ఇద్దరి మీద ఎక్కువ ఇష్టం ఉండోచ్చ్.

Image result for child artist Atulit

తులసి సినిమా సమయంలో నయనతార చాలా ప్రేమగా ఉండేదని ఆ ప్రేమ వలనే నయనతార మీద ఎక్కువ ఇష్టం కలిగేలా చేసింది.ఇక రజనీకాంత్ అంటే చాలా ఇష్టం అని రజినీకాంత్ తో నటించడమనే తనకు ఉన్న కోరిక అని అతులిత్ అన్నాడు.అయితే చాలా రోజులు చదువు కోసం సినిమాలకు దూరంగా ఉన్నా అతులిత్ తాజాగా ఘంటసాల బయోపిక్ లో నటిస్తున్నాడు.ఘంటసాల పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధపడుతున్నాడు.రీసెంట్ గా రీలీజ్ అయినా ఘంటసాల టీజర్ ను చూస్తే తులసిలో నటించిన పిల్లాడు ఘంటసాలలో నటించిన పిల్లడు ఒకడేనా అని అనిపించకమానదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎన్నో గ్రేట్ పాటలకు కేంద్రబిందువు అయినా తెలుగు జాతి గర్వించదగిన సింగర్ ఘంటసాల బయోపిక్ లో నటించడం తన అదృష్టమని అతులిత్ చెప్పుకొచ్చాడు.ఈ టీజర్ చూస్తే అప్పటి అతులిత్ కు ఇప్పటి అతులిత్ కు చాలా తేడాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.అల్ల్లరి పిల్లాడి పాత్రలలో నటించే ఈ బుడ్డోడు తెలుగుజాతి గర్వించదగిన ఘంటసాల గారి పాత్రలో నటించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.చూడాలి మరి ఆ పాత్రతో అతులిత్ ఏమేర మెప్పిస్తాడో.అతను ఇలాగే మంచి మంచి సినిమాలలో నటిస్తూ అందరి మన్ననలను పొంది ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుందాం.మరి మాష్టర్ అతులిత్ గురించి అతని చిలిపి యాక్టింగ్ గురించి అలాగే ఇప్పుడు చేస్తున్న ఘంటసాల బయోపిక్ లో అతులిత్ నటించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.