బిగ్ బాస్ అర్చన భర్త ఎవరో తెలిస్తే అస్సలు నమ్మలేరు

591

హీరోయిన్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పుడు ఈమె ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోలతోనే తాను ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పింది అర్చన. ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. జగదీష్ అనే కుర్రాడితో వేద ఏడడుగులు నడవబోతుంది. తన నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోను అర్చన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. త్వరలోనే అందరికీ గ్రేట్ న్యూస్ చెప్పబోతున్నానని, అప్పటి వరకు ఈ మూమెంట్స్‌ను మీరు కూడా ఎంజాయ్ చేయండని పోస్ట్ చేసిన ఈమె.. ఇప్పుడు ఆ న్యూస్ చెప్పేసింది. తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన అర్చన ఇప్పుడు అతన్ని అందరికీ చూపించేసింది. అక్టోబర్ 3న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో వీళ్ళ ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి సుమంత్, నవదీప్, శివబాలాజీ, మధుమిత వచ్చారు.

Image result for బిగ్ బాస్ అర్చన భర్త

అర్చన తపన సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె నటించిన రెండో సినిమా నేను ఆమెకి బాగా పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాతోనే ఆమెకి ఇండీస్ట్రీలో గుర్తింపు ఏర్పడింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో బాగా లైమ్ లైట్ లోకి వచ్చిన అర్చన ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ చేసింది. ఆమెకి హీరోయిన్‌గా పెద్దగా పేరు రాకపోయినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం చాలా గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించింది. హిందీలో కూడా ఒక సినిమా చేసింది అర్చన. ఆమెని తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది గ్రాండ్ లెవెల్‌లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో. ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలయిన ఈ షో ఫస్ట్ సీజన్‌లో అర్చన కూడా టైటిల్ ఫేవరేట్. ఆమె టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే ఆ తరువాత కూడా ఆమె చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా రావట్లేదు. లయన్ సినిమాలో ఆమె చివరిసారిగా కనిపించింది. సినీ కెరీర్ ఇక ముగిసినట్టే కనిపిస్తుండటంతో పెళ్లి చేసుకోనుంది అర్చన. అయితే ఈమెకు కాబోయే వరుడు ఎవరో మీకు తెలుసా.. అతని పేరు జగదీశ్‌ భక్తవత్సలం. ఇతను వ్యాపారవేత్త. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. ఎప్పటినుండో ఆమె జగదీష్ తో లవ్‌లో ఉంది. ఇప్పుడు అతనితోనే ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఆమె పెళ్ళి డేట్ మాత్రం బయటికి రాలేదు. మొత్తానికి ఆమె కోరుకున్న వ్యక్తితో పెళ్ళి అవుతున్నందుకు ఆమె చాలా హ్యాపీగా ఉంది. మరి అర్చన పెళ్లి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి