ఉదయ్ కిరణ్ చనిపోయి 5 ఏళ్ళు ..భార్య విషీత చేసిన పని తెలిస్తే షాక్

1472

ఉదయ్ కిరణ్…తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు ఉండే పేరు.ఎలాంటి ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలలోకి వచ్చి తనకంటూ ఒక స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు.యూత్ ను ఎక్కువగా అట్రాక్ చేసి అమ్మాయిల మనసులను దోచుకున్నాడు.లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.మెగాస్టార్ చిరంజీవికి అల్లుడయ్యే అవకాశాన్ని కొన్ని కారణాలవల్ల కోల్పోయిన ఉదయ్ కిరణ్ ఆతరువాత సినిరంగం లోనుఒక డౌన్ ఫాల్ ను చవిచుసాడు. కారణం ఏంటో ఖ‌చ్చితంగా తెలియ‌క పోయినా ఉదయ్ కిరణ్‌కు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.అయితే అతను చనిపోవడం వలన ఎవరికీ ఎలాంటి నష్టం వచ్చిందో ఏమో కానీ ఎక్కువ నష్టపోయింది మాత్రం అతని భార్య విషితనే.

Image result for uday kiran

ఉదయ్ కిరణ్ విషిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఏడాది ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయానికి విషిత ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తుంది. పెళ్లినాటికే ఉదయ్ సినీ కెరీర్ ఏం బాగాలేదు. అప్పులు కూడా పెరిగిపోయాయి. దాంతో ఫిలిం నగర్ నుంచి శ్రీనగర్ కాలానికి షిప్ట్ అయ్యాడు.అయినా పరిస్థితి ఏం మారలేదు. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ చనిపోయే రోజు వరకు ఇద్దరు చాలా అన్యున్యంగానే జీవించారు. అయితే ఉదయ్ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటాడని విషిత కలలో కూడా ఊహించి ఉండదు. ఎందుకంటే సినిమాలు లేకున్నా సరే విషిత తెచ్చే జీతంతో చాలా సంతోషంగానే ఉన్నారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకున్నాడు. కానీ మనసులో ఏమనుకున్నాడో ఏమో సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ జనవరి 5 కి ఉదయ్ కిరణ్ చనిపోయి ఐదేళ్లు అవుతుంది. ఎంతో ఆనందంగా జీవించమని కానీ తనను ఒంటరివాడిని చేసి వెళ్లిపోయిందని కుమిలిపోయింది. అయితే ఈ ఐదేళ్లుగా ఉదయ్ పుట్టిన రోజును చనిపోయిన రోజున ఏదో ఒక సేవా కార్యక్రమం చెయ్యడం విషిత ఫాలో అవుతుంది. తనకు వచ్చే కొద్దిపాటి జీతంతోనే పేదలకు అన్నదానం చెయ్యడం స్వచ్చంద సేవా సంస్థలకు దానం చెయ్యడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈసారి కూడా ఒక అందుల పాఠశాలకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు అన్నదానం దుస్తులు అందించింది. ప్రస్తుతం ఆమె శ్రీనగర్ కాలనీ నుంచి మణికొండలో ఉండే తల్లిదండ్రుల వద్దకు షిప్ట్ అయ్యింది. ఉదయ్ కిరణ్ కు పిల్లలు అంటే ఎంతో ఇష్టం అని అందుకే ఉదయ్ కిరణ్ పేరు మీద ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానని వీటిని ఉదయ్ పైనుంచి చూస్తూ ఉంటాడని కన్నీటి పర్యంతం అయ్యింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఉదయ్ కిరణ్ చనిపోవడం గురించి అలాగే విషిత ఇన్నాళ్లు అయినా ఒంటరిగా జీవిస్తూ ఉదయ్ పేరు మీద సేవా కార్యక్రమాలు చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.