నటి ఝాన్సీ ఆత్మహత్య లో షాకింగ్ ట్విస్ట్ ..బయటపడ్డ సూసైడ్ నోట్..ఏముందో తెలిస్తే షాక్

403

వెండితెర బుల్లితెర మీద నటించి మనల్ని అలరించే నటీనటులు వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు వర్దమాన టీవీ నటి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీలో తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఝాన్సీ. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Image result for jhansi

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్తోపాటు మరో రెండు సినిమాల్లోనూ నటించిన ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్కాలనీలో నివాసం ఉంటోంది.అయితే ఝాన్సీ బలవన్మరణానికి ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. అయితే ఇంట్లో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతకగా ఒక సూసైడ్ నోట్ లభించింది. అందులో తన బాధనంతా చెప్పుకుంది ఝాన్సీ. ఎన్నో కలలతో హైదరాబాద్ వచ్చిన నన్ను నాని మోసం చేశాడు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అతను పరిచయం అయ్యాడు. ప్రేమ అంటే నమ్మాను. అతని కోసం కొన్ని సినిమాలను కూడా వదులుకున్నా. సినిమాలు వద్దంటే సరే నటించను అని చెప్పాను. షూటింగ్ లో లేట్ అయితే అనుమానపడేవాడు. అయినా కనై అతని మీద ఉన్న ప్రేమతో నటించడం మానేశాను.

అయితే ఇంట్లో ప్రేమ వ్యవహారం చెబితే ఒప్పుకోలేదు. ఈ విషయం నానికి చెబితే మీ ఇంట్లో ఒప్పుకోకుంటే మనం విడిపోవడమే మంచిది అని అన్నాడు. మా ఇంట్లో కూడా ఒప్పుకోవడం లేదని అన్నాడు.అతని కోసం అన్ని వదులుకున్న నన్ను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు. ఇన్ని టెన్షన్స్ మధ్య నేను బతికుండటం వేస్ట్ అందుకే చనిపోతున్నా. నన్ను క్షమించండి అని ఎంతో భాదతో లెటర్ రాసింది ఝాన్సీ. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.అయితే కూతురి ప్రేమ వ్యవహారం తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు.మరి ఝాన్సీ ఆత్మహత్య గురించి సూసైడ్ నోట్ లో ఝాన్సీ రాసిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.