Breaking News : రోడ్డుప్రమాదంలో ప్రముఖ సినీ గాయకుడు మృతి..షాక్ లో సినీ ఇండస్ట్రీ

174

సినీ రంగంలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.సినీ ప్రముఖులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు.రోడ్డు ప్రమాదాలలో పడి కొందరు చనిపోతే మరికొందరు ఆరోగ్యం బాగాలేక చనిపోతున్నారు.ఇప్పుడు మరొక ప్రముఖ సింగర్ చనిపోయాడు.మరి ఆయనెవరో ఎలా చనిపోయాడా తెలుసుకుందామా.

Image result for నితిన్ బాలీ

ఇటీవ‌ల మ‌ల‌యాళ సింగ‌ర్ బాల‌భాస్క‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ విషాదం నుండి కోలుకోక‌ముందే మ‌రో సింగ‌ర్ రోడ్డు ప్ర‌మాదంతో మృత్యువాత ప‌డ్డారు. మాల‌ద్ నుండి బొరివిల్లిలో ఉన్న త‌న ఇంటికి వెళుతున్న క్ర‌మంలో గాయ‌కుడు నితిన్ బాలీ(47) కారు డివైడ‌ర్‌ని ఢీకొట్ట‌డంతో ఆయ‌న త‌ల‌కి, ముఖానికి తీవ్ర గాయాల‌య్యాయి. ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆసుప‌త్రిలో ప్ర‌థ‌మ చికిత్స మాత్ర‌మే తీసుకున్న ఆయ‌న వెంట‌నే త‌న ఇంటికి వెళ్ళార‌ట‌. ఇంటికి వెళ్ళాక క‌డుపు నొప్పి, వాంతులో పాటు బీపీ పెర‌గడంతో ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు.

Image result for నితిన్ బాలీ

కాని అంత‌లోనే ఆయ‌న చనిపోయారని గాయ‌కుడి మేన‌కోడ‌లు తెలిపారు.1990వ సంవత్సరంలో నితిన్ బాలీ పాడిన రీమిక్స్ పాట ‘‘నీలీ నీలీ అంబర్ పర్’’ సంచలనం రేపింది. ఆరుకు పైగా ఆల్బమ్స్ చేసిన ఆయ‌న ‘నా జానే’తో మ్యూజిక్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2012లోనే మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. నితిన్ బాలీ ప్రముఖ టీవీ నటి రోమాను వివాహమాడారు. హ‌ఠాత్తుగా క‌న్నుమూసిన బాలీవుడ్ ప్ర‌ముఖ‌గాయ‌కుడికి హిందీ సినీ ప‌రిశ్ర‌మ నివాళులు అర్పించింది. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని వారు కోరారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నితిన్ బాలీ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.పలువురు సినీ ప్రముఖులు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు.మనం కూడా కామెంట్ రూపంలో ఆయనకు నివాళి అర్పిద్దాం.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.నితిన్ బాలీ గురించి ఆయన పాడిన ఆల్బమ్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.