Breaking News :ప్రముఖ‌న‌టుడు మృతి శోక‌సంద్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌

530

వినోద పరిశ్రమలో మరో నటుడు ఆత్మాహత్యయత్నానికి పాల్పడ్డాడు. హిందీ టెలివిజన్ నటుడు రాహుల్ దీక్షిత్ సూసైడ్ చేసుకోవడం సినీ, టెలివిజన్ రంగాలను కుదిపేసింది. 28 ఏళ్ల రాహుల్ అనుమానాస్పద స్థితిలో మరణించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.రాహుల్ దీక్షిత్ జైపూర్‌కు చెందిన వాడు. టెలివిజన్ రంగంలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో తన నివాసంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మరణించాడు అని పోలీసులు తెలిపారు.

ముంబైలో ఆత్మహత్య

ముంబై పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. రాహుల్ మృతిని ఆత్మహత్యగానే నిర్ధారించారు. అయితే గదిలో సూసైడ్ నోట్ లభించకపోవడం వల్ల కొన్ని అనుమానాలు తలెత్తాయి. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుస్తోంది. తరువాత కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు… రాహుల్ దీక్షిత్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మరణానికి ముందు కొద్ది గంటల క్రితం రాత్రి రాహుల్ తన స్నేహితులతో పార్టీ చేసుకొంటున్నట్టు తన ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేశాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పార్టీలో గానీ, పార్టీ తర్వాత ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.రాహుల్ మరణంతో తండ్రి మహేష్ దీక్షిత్ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నాడు. ఈ ప్రపంచాన్ని వీడిపోవాల్సిన ఖర్మ ఏం పట్టింది రాహుల్ అంటూ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. రాహుల్ తండ్రి చేసి ట్వీట్‌ నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తున్నది.