త్రివిక్రమ్ తర్వాత సినిమా ఇదే..?

100

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. ఎన్టీఆర్ – పూజా హేగ్డే జంట‌గా న‌టించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది.

త్రివిక్ర‌మ్ వెంకటేష్ తో సినిమా చేస్తా అని అన్నాడు.అలాగే త్రివిక్రమ్ కోసం అల్లుఅర్జున్ కూడా వెయిట్ చేస్తున్నాడు.వెంకటేష్ ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే సినిమా చేస్తున్నారు.ఈ మూవీ ఈ నెలాఖ‌రున సెట్స్ పైకి వెళ్ల‌నుంది.దీంతో త్రివిక్ర‌మ్ సినిమా చేద్దామ‌న్నా వెంకీ ఫ్రీగా లేరు.

Related image

అందుచేత త్రివిక్ర‌మ్‌ని వేరే హీరోతో సినిమా చేయ్.. ఆ త‌ర్వాత మ‌నం క‌లిసి సినిమా చేద్దాం అని వెంకీ చెప్పాడ‌ట‌. ప్రస్తుతం బన్నీ కూడా ఖాళీగా ఉన్నాడు.బన్నీ త్రివిక్రమ్ తో చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.మ‌రి.. త్రివిక్ర‌మ్ బ‌న్నీతో సినిమా చేస్తాడో..? లేక‌.. వేరే హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.