‘అరవింద సమేత’ సెట్స్‌లో మొబైల్స్ బ్యాన్ చేసిన త్రివిక్రమ్..ఎందుకో చూడండి..

448

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత అనే సినిమా చేస్తున్నాడు.షూటింగ్ షరా వేగంగా నడుస్తుంది.అయితే ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఎవరు సెట్ లో ఫోన్స్ వాడకూడదు అని షరత్ పెట్టారు.ఎందుకో తెలుసా..

ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతున్నాయి. సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి చిత్ర యూనిట్ అప్రమత్తంగా ఉన్నా తాజాగా ఎన్టీఆర్, నాగబాబు మధ్య ఎమోషనల్ సీన్‌కి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడంతో డైరెక్టర్ త్రివిక్రమ్ కు కోపం వచ్చింది.

దాంతో మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ఈ దర్శకుడు మొబైల్ ఫోన్స్‌ని ఎవరూ సెట్స్‌లో వాడొద్దని ఆదేశించాడు. ప్రొడక్షన్ సభ్యులైన సరే మొబైల్ ఫోన్స్‌ని వినియోగించాలంటే సెట్‌కి దూరంగా వెళ్లాలని త్రివిక్రమ్ గట్టిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.