న్యూ ఇయర్ నైట్ ఫాన్స్ కు త్రివిక్రమ్ బన్నీ అదిరిపోయే గిఫ్ట్!

234

నా పేరు సూర్య తర్వాత అల్లుఅర్జున్ నుంచి మరే చిత్రం రాలేదు.అయితే అతను త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని వార్తలు గట్టిగ వినిపిస్తున్నాయి.
బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ మీద కన్నేశారని వినిపిస్తుంది. .త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పవర్ ఫుల్ యూత్ ఎంటర్ టైనర్ కథని బన్నీ కోసం సిద్ధం చేశాడట. అల్లు అర్జున్ కూడా కథ అదరిపోయిందని త్రివిక్రమ్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Image result for allu arjun trivikram

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీకి తుది మెరుగులు దిడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర ప్రకటన కోసం బన్నీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడట. న్యూ ఇయర్ నైట్ కరెక్ట్ సమయమని భావిస్తున్నారట. సినిమా ప్రకటనతో పాటు నేరుగా టైటిల్ లోగో కూడా విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి చివర్లో షూటింగ్ మొదలు పెట్టి దసరాకు విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు.

Image result for allu arjun trivikram

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయం అందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.మరి ఈ హ్యాట్రిక్ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.