విక్ర‌మ్ సినిమా నుంచి అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చా త్రిష

462

కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లో కూడా త‌న సినిమాల‌తో మంచి ఫేమ్ సాధించుకున్నాడు హీరో చియాన్ విక్ర‌మ్.. ఇక అప‌రిచితుడు సినిమా ఆయ‌న చిత్రాల్లో ఓ బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ అనే చెప్పాలి..చియాన్ విక్రమ్, త్రిషలు జంటగా 2003లో దర్శకుడు హరి రూపొందించిన చిత్రం సామి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆనాడు భారీ స‌క్సెస్ అందుకుంది.

Image result for సామి స్క్వేర్

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీయాలి అని భావించారు హ‌రి.. దీనికి సామి స్క్వేర్ అని టైటిల్ ఫిక్స్ అయ్యారు..ఇక విక్ర‌మ్ కు జోడిగా ముందు త్రిష న‌టించాలని అనుకున్నారు.. కాని అది కుద‌ర‌లేదు..ఇక ఆమె ప్లేస్ లో కీర్తిసురేష్ ని తీసుకున్నారు చిత్ర యూనిట్…తాజాగా త్రిష ఈ సినిమా ఎందుకు ఒప్పుకోలేదో తెలియ‌చేసింది.

Image result for సామి స్క్వేర్

సామి స్క్వేర్లో న‌టించాల‌ని నేను అనుకోలేదు ఎందుకు అంటే ఆ స్టోరీ నాకు త‌గ్గ‌ట్లు లేదు అని ఆమె తెలియ‌చేసింది.. ఇక తొలి షూటింగ్ షెడ్యూల్ కు ముందే నేను ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాను అని ఆమె తెలియ‌చేశారు.ఇక విక్రమ్ సరసన కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.