అల్లు అర్జున్ కు షాకిచ్చిన పోలీసులు

244

ఈరోజుల్లో సోషల్ మీడియాని యువత బాగా వాడుతున్నారు అని చెప్పాలి ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు యమ ఫాస్ట్ అయిపోయారు. అతడు హీరోనా.. ప్రముఖ దర్శకుడా అన్న సంగతిని పక్కనపెట్టేస్తున్నారు. రోడ్డు మీదకు వచ్చినప్పుడు అందరూ రూల్స్ పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అతిక్రమిస్తే ఎంతటి వారికైనా శిక్ష వేయాల్సిందేనని తమ చర్యలతో తేల్చిచెబుతున్నారు. ఎక్కడైనా ఎవరైనా సెలబ్రెటీ తప్పుచేస్తే వెంటనే ప్రశ్నిస్తున్నారు అందరికి రోల్ మోడల్ గా ఉండాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి, పైగా సోషల్ మీడియా ఇంత ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ పోస్టులతో మరింత హైలెట్ చేస్తున్నారు.తాజాగా అల్లుఅర్జున్ కు ఇలాంటి స్ట్రోక్ తగిలింది.

Related image

మొన్నటికి మొన్న ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బైక్ పై త్రిబుల్ రైడింగ్ రాగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. పోలీసులు బైక్ కు ఫైన్ వేశారు. ఇక తాజాగా అల్లు అర్జున్ ఎంతో ముచ్చటపడి కొనుక్కొని ప్రాణంగా చూసుకుంటున్న క్యారవాన్ కు పోలీసులు ఫైన్ వేసిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ క్రింద వీడియోని చూడండి

స్టార్ హీరో అల్లు అర్జున్ కోట్లు పెట్టి ప్రత్యేకంగా తయారు చేయించుకున్న క్యారవాన్ సౌకర్యాలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అత్యంత విలాసవంతమైన క్యారవాన్ తాజాగా ఈ నెల 16న సాయంత్రం 4.25 గంటలకు రోడ్డుమీదకు వచ్చింది. హిమాయత్ సాగర్ ప్రాంతంలో వెళ్తోంది. ట్రాఫిక్ జామ్ కావడంతో అటు గా దాని వెనుక ఉన్న మహ్మద్ అబ్దుల్ అజం దాన్ని గమనించాడు. నిబంధనలకు విరుద్ధంగా అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ వేసుకొని ఉండడాన్ని ఫొటో తీసి సైబరాబాద్ పోలీసులకు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు.

Allu Arjun's swanky new caravan caught by the Cyberabad Police for violating traffic rules

ఇక నెటిజన్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై అంతే వేగంగా స్పందించిన పోలీసులు ఆ క్యారవాన్ అల్లు అర్జున్ కు చెందినదిగా తేల్చి నిబంధనలు ఉల్లంఘించినందుకు అల్లు అర్జున్ కు రూ.735 జరిమానా విధించడం సంచలనంగా మారింది. ఇలా అందరూ రూల్స్ పాటించాల్సిందేనని అటు పోలీసులు ఇటు నెటిజన్లు తాజా ఉందంతంతో మరోసారి నిరూపించినట్టైంది. గతంలో చాలా మంది ప్రముఖుల కార్లకు ఇలా బ్లాక్ ఫిల్మ్ తగిలించుకుని వెళ్లడంతో వారికి ఫైన్లు వేశారు, ఇక వారి కార్లకు నోటీసులు పంపారు. సో ఇంకా అలాంటి ఫిల్మ్ తీయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. ..మరి బన్నీ క్యారవాన్ కు బ్లాక్ ఫిల్మ్ ఉంచుతాడా లేదా అనేది చూడాలి.