మతం మార్చుకున్న టాప్ హీరోలు, హీరోయిన్లు వీళ్ళే కారణం తెలిస్తే మతిపోవడం ఖాయం

804

మ‌న దేశంలో ఎవ‌రు ఏ మతం అయినా స్వీక‌రించ వ‌చ్చు సాధార‌ణ‌ప్ర‌జ‌లు ఏమో కాని ఎవ‌రైనా సెల‌బ్రెటీల విష‌యంలో వారి మ‌తం కులం ఏమిటి అనే విష‌యంలోఎంత ఆస‌క్తి అభిమానులు సాధార‌ణ జ‌నాలు చూపిస్తారు. ఇక ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేది ఇప్పుడు కాదు ఎప్ప‌టి నుంచో ఉన్న నియ‌మం .. ఇలా ఎవ‌వ‌రైనా ఏమ‌త‌మైనా ఆచరించవచ్చు. భారతదేశంలో ఉండడంతో మతం మార్చుకునేవాళ్ళు చాలామంది వుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు. మ‌రి వారిలో ప్ర‌ముఖులు ఎవ‌రు వారి గురించి ఈరోజు తెలుసుకుందాం.

Image result for ar rahman

క్రిస్టియన్ కుటుంబానికి చెందిన దక్షిణాది స్టార్ హీరోయిన్ లిజి హిందువైన ,దర్శకుడు ప్రియదర్శన్ ని పెళ్లాడింది. తద్వారా హిందూ మతంలోకి మారడమే కాదు లక్ష్మీగా పేరు మార్చుకుంది. ఇలా ఆమె మ‌రింత ఫేమ‌స్ అయింది అని చెప్పాలి ఇక్క‌డ ఆమె పేరు మార్చుకున్నా కొంద‌రు ఆమెని లిజి అని పిలుస్తారు ల‌క్ష్మీ అని పిలుస్తారు.ఇక ఏ ఆర్ రెహ్మాన్ సంగతి చాలామందికి తెలిసిందే. ఇతడి పేరు దిలీప్. చిన్నప్పుడు వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఇస్లాం వైపు మొగ్గారు. ఆర్ధిక,ఆరోగ్య పరిస్థితులు మెరుగవ్వడంతో అల్లాపై నమ్మకం పెరిగింది. 1989నుంచి మతం మారి, పేరును అల్లా రఖా రెహ్మాన్ గా మార్చుకున్నారు. అల్లా పెట్టిన పేరు అని ఆ పేరులోని అర్ధం.

Image result for కుష్బూ

నటి కుష్బూ కూడా పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ,సుందర్ అనే హిందువుని పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటినుంచి హిందూ విశ్వాసం పెంచుకున్నారు. ఈమెపై చాలా విమర్శలు వచ్చినా నిర్ణయం మార్చుకోలేదు.ఇక వివాహం చేసుకున్న త‌ర్వాత ఆమె మొత్తం హిందూ విశ్వాసాలు న‌మ్మ‌కాలు పూజ‌లు చేస్తూ అంద‌రిని ఆక‌ట్టుకున్నారు.ఇక స్టార్ హీరోయిన్ నగ్మా క్రిస్టియన్ గా మారింది. నిజానికి తల్లి ముస్లిం,తండ్రి హిందువు. అయితే ఈమెకు క్రిస్టియానిటీ పై నమ్మకం ఏర్పడింది. 2007లో బాప్తిజం స్వీకరించింది. ఇలా ఆమె త‌న‌కు న‌చ్చిన మ‌తం త‌న‌కు స్వీక‌రించే అవ‌కాశం ఉంది అని కూడా తెలియ‌చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అదే కోవలో యువన్ శంకర్ రాజా హిందూ మతం నుంచి ఇస్లాం లోకి మారాడు. తల్లి మరణం తరువాత ఇస్లాం పై నమ్మకం ఉందని ట్వీట్ చేసి,అటువైపు ఆకర్షితుడయ్యాడు. ఇలా ఆయ‌న కూడా ఇప్పుడు ఇస్లాం మతంలో ఉన్నారు.స్టార్ హీరోయిన్ నయనతార కూడా సిరియన్ క్రిస్టియన్. అయితే చెన్నైలోని ఆర్య సమాజ్ లో శాస్త్రోక్తంగా హిందూయిజంలో కి మారింది. కాగా తమిళంలో దుమ్ము రేపిన నటి మోనికా హిందూ మతం నుంచి ఇస్లాం లోకి మారి,ఇంజి రెహిమగా పేరు మార్చుకుంది. ఇలా చాలా మంది న‌టీమ‌ణులు త‌మ మ‌తం నుంచి త‌మ‌కు న‌చ్చిన మ‌తంలోకి వెళ్లారు ఆ మ‌తాల‌కు అనుగుణంగా. ఆ దేవుణ్ణి విశ్వ‌సిస్తున్నారు. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.