ఈ యాంకర్స్ ఒక్క రోజు రేటు తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.

1418

యాంకరింగ్ అనేది చాలా రిస్క్ జాబ్.తమవైన అందచందాలతో మత్తు చల్లుతూనే మాటల గారడీతో కట్టిపడేయడమే యాంకరింగ్ స్కిల్. చూస్తున్నంత సేపు తమను మాత్రమే కళ్లన్నీ వెతకాలి. తాము ఏం చెబితే అది జోలపాటలా వినాలి. అప్పుడే బెస్ట్ యాంకర్ గా గుర్తింపు. ఇలాంటి గజకర్ణ గోకర్ణ కనికట్టు విద్యలో రాటుదేలిపోయిన యాంకరమ్మలెందరో టాలీవుడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు బుల్లితెరను ఏల్తూనే – సినిమా తెరకు వీళ్లు చేసే సాయం చిన్నదేం కాదు. బుల్లితెర – వెండితెర అనే తేడా లేకుండా అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వీళ్లు ఖాతాల్లోకి మళ్లించే పైకం రేంజేమీ తక్కువేం కాదు.అయితే ఇప్పుడున్న టాప్ యాంకర్లలో పారితోషికంలో ఎవరు టాప్? ఎవరికీ ఎంత రెమ్యునరేషన్ వస్తుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగులో ఉన్న టాప్ యాంకర్ల పారితోషికాల రేంజు ఎంత? మీడియం రేంజ్ యాంకర్లు – అప్ కమ్ యాంకర్ల రేంజు ఎలా ఉంది? అని ఆరాతీస్తే కళ్లు భైర్లు కమ్మే నిజాలే తెలిశాయి. ఏదో ఎగేసుకుని వచ్చేస్తే యాంకర్లు అయిపోతారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వీళ్లకు బోలెడంత స్కిల్ అవసరం – స్టేజీ పెర్ఫామెన్స్ లో ఎలాంటి బెరుకు ఉండకూడదు.. మెయింటెనెన్స్ కూడా ఎక్కువే కాబట్టి అందుకునే పారితోషికాలు ఆ రేంజులోనే ఉన్నాయన్నది సర్వేలో తేలింది.ఇండస్ట్రీ బెస్ట్ యాంకర్ ఎవరో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ సుమ ఒక్కో ఈవెంట్ కి రూ.2- 2.5లక్షల రేంజులో అందుకుంటుందట. భారీగా అవార్డులు వంటి స్టేజ్ కార్యక్రమాలకు అయితే ఇంకా పెద్ద మొత్తమే ముడుతుంది. స్వతహాగానే మంచి మాటకారి అయిన ఈ మలయాళ భామ తెలుగింటి హాసినిలా బాగా ఫేమస్ అయ్యింది. దశాబ్ధాల అనుభవం ఉంది కాబట్టి.. తనదైన టైమింగ్ తో ఛమక్కులు విసురుతూ అహూతుల్ని బోల్తా కొట్టించడంలో బహు నేర్పరి. అందుకే అడిగినంతా ఇచ్చేయాల్సిందే.

Image result for telugu anchors

ఇక ఆ తర్వాత మళ్లీ ఆ రేంజు యాంకరు ఎవరు? అంటే అనసూయ మాత్రమే. జబర్థస్త్ షో కంటే ముందే అనసూయ ఫేమస్. యాంకరింగ్ రంగానికి గ్లామర్ ని పీక్స్ లో అద్దిన మేటి యాంకరమ్మగా – రంగమ్మత్తగా అనసూయ పాపులారిటీ అసాధారణం. అందుకే ఈ భామకు ఒక్కో ఈవెంట్ కి రూ.2లక్షలు ముడుతుందిట. ఇక అదే జబర్థస్త్ షోతో వయ్యారాల వడ్డనలు చేయడంలో కిర్రాక్ యాంకరమ్మగా పాపులరైన రష్మీ 1.50- 1.75 లక్షల రేంజులో అందుకుంటోందట. ఇక యాంకర్ శ్యామల బిగ్ బాస్ తో ఎంతగా ఫేమస్ అయ్యారో తెలిసిందే. అంతకుముందే ఒక్కో ఈవెంట్ కి రూ.50వేల వరకూ అందుకున్నారట. ఇటీవల వరుసగా సినిమా ఈవెంట్లలో మెరుస్తూ చిల్లుబుగ్గల బ్యూటీగా అలరించిన మంజూష ఒక్కో ఈవెంట్ కి రూ.30 వేలు- రూ50వేల వరకూ అందుకుంటోందట. ఇక యాంకర్ సోనియా రూ.20 వేలు- 30వేల రేంజు పారితోషికం అందుకుంటుందని సమాచారం. వీళ్లతో పాటే చిన్నా చితకా యాంకర్లు – టీవీ9 – ఎన్టీవీ – టీవీ 5 యాంకర్లు భారీగానే పారితోషికాలు అందుకుంటున్నారని తెలుస్తోంది.టాప్ 5 లో మాత్రం వీళ్ళే ఉన్నారు.మరి ఈ యాంకర్స్ గురించి వారి మాటకారితనం గురించి అలాగే వాళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.