ఇండియాలో తీసిన టాప్ 12 గే/లెస్బియన్ సినిమాలు

365

స్వలింగ సంపర్కం ఇప్పటిది కాదు. 1860లకు ముందు నుంచే భారతదేశంలో ఉంది. ఏదో పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయ్యిందంటూ కొందరంటున్నారు కానీ ఇది ఇండియాలో పూర్వం నుంచే వుండిందని స్పష్టమవుతోంది. దీనికి తార్కాణం ఏంటయా అంటే, 1860లో లార్డ్ మెకాలే భారతీయ శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ కింద స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని ప్రకటించడమే. అంటే… అంతకంటే ముందు నుంచే స్వలింగ సంపర్కం ఉన్నదన్నమాట. ఈ స్వలింగ సంపర్కం పై భారతీయ సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు టివి సీరియల్లు నిర్మితమవుతున్నాయి..ఈ సినిమాలు సీరియల్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం..

ఈ క్రింద వీడియో చూడండి

ఉత్తమ చిత్రం 2016 ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా ఏమిటో తెలుసా? గూగుల్ చేయాల్సిన అవసరం లేదులెండి. ఆ సినిమా పేరు “మూన్ లైట్”. ఇది హృదయాల్ని హత్తుకునే ఒక గే కథ. అందుకే “లాలాలాండ్” లాంటి పాపులర్ సినిమాను కాదని ఈ సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చారు. ఇలా గే/లెస్బియన్ జీవితాలను తెర మీద ఆవిష్కరించడం హాలివుడ్ వారికి కొత్తేమి కాదు. మరి భారతీయ చలచిత్ర రంగంలో ఇలాంటి సాహాసాలు చేస్తున్నారా ? కమర్షియల్ మాస్ సినిమాలే చూస్తాం కాబట్టి మనకు అంత సినిమా జ్ఞానం ఉండదు కాని మన దేశంలో కూడా స్వలింగ సంపర్కుల జీవితాలని చూపించిన సినిమాలు ఉన్నాయి..

ఈ ట్రెండ్ కొత్తగా మొదలవలేదు. 1970ల్లోనే మొదలైంది. 1978 “రండు పెంకుటిక్కల్” అనే మళయాళ సినిమా ఇద్దరు మహిళల మధ్య ప్రేమను చూపించింది. ఆ తరువాత పదుల సంఖ్యలలో స్వలింగ సంపర్కుల సినిమాలు వచ్చాయి. అయితే మీకోసం ఓ 12 సినిమాలు/టీవీ సీరిస్ ఇక్కడ పరిచయం చేస్తున్నాం.

Image result for The Other Love Story

1.The Other Love Story

ఇదొక వెబ్ సీరీస్, సినిమా కాదు. ఆధ్య – ఆంచల్ అనే ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ బంధాన్ని ఏంతో పోయేటిక్ గా తీసారు. లిప్ కిస్ సన్నివేశాలు ఉన్నా, అవి వల్గర్ గా ఉండవు. స్వచ్చమైన ప్రేమకథ ఇది. ఎదో బూతు సీరీస్ కాదు. మీరు ఒకసారి చూస్తే ఇది సజెస్ట్ చేసినందుకు మెచ్చుకోకుండా ఉండలేరు..

Image result for Margarita With A Straw(2014)

2. Margarita With A Straw(2014)

మనదేశంలోనే కాదు. ప్రపంచంలో ఉన్న అతిగొప్ప నటుల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. అలాంటి నటుడితో కంటతడి పెట్టించిన సినిమా ఇది. శారీరక లోపాలు ఉన్న అమ్మాయి ప్రేమను వెతుకుతుంది. తన జీవిత అనుభవాలు, ఒక అమ్మాయితో ప్రేమ సంబంధం . ఇది కథ వస్తువు..ఇందులోనూ కిస్సింగ్ సీన్స్ ఉన్న అస్సలు వల్గర్ గా ఉండవు.

Image result for Aligarh(2015)

3 Aligarh(2015)

ఇటు విమర్శకుల ప్రశంసలు, అటు అవార్డులు, కొద్దిపాటి బాక్సాఫీస్ వసూళ్ళు అన్నీ దక్కాయి ఈ సినిమాకు..ఇది ఒక రియల్ స్టోరీ..స్వలింగ సంపర్కుడైన డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవితాన్ని ఇందులో చూపించారు..

Image result for Girlfriend(2004)

4 Girlfriend(2004)

ఇదేమి క్లాసిక్ సినిమా కాదు..ఫక్తు కమర్షియల్ సినిమా..బాలివుడ్ లో పేరు సంపాదించిన ఇషా కొప్పికర్ అమృత అరోరా లాంటి హీరోయిన్లు ఇందులో బెడ్ రూమ్ సీన్ చేయడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం..ఇది క్లాస్ సినిమా కాదు కాబట్టి చూడాలో వద్దో మీరే నిర్ణయించుకోవాలి..

Image result for My Brother Nikhil(2005)

5 My Brother Nikhil(2005)

ఓ గే కపుల్ ..వారి బంధాన్ని అర్ధం చేసుకోలేని సమాజం..దీన్నే కధా వస్తువుగా ఓ అందమైన్ సినిమాను తీసారు..అలనాటి బాలివుడ్ టాప్ హీరోయిన్ జూహీ చావ్లా ఇందులో ముఖ్య పాత్ర పోషించారు..ఇందులో ఎయిడ్స్ వ్యాధి మీద కూడా అవగాహన కల్పించారు…

Image result for My Life Partner(2014)

6 My Life Partner(2014)

మళయాళ సినిమాలు అంటేనే అందమైన సినిమాలు.. మనదేశంలో మంచి సినిమాలు తీయాలంటే ఆ ఇండస్ట్రీ తరువాతే ఎవరైనా..2014 లో వచ్చి ఇద్దరి మగవారి మధ్య బందాన్ని ఎంతో అందంగా చూపించిన మై లైఫ్ పార్టనర్ ఓ క్లాసిక్ గా గుర్తింపు పొందింది..IMDB లో దీని రేటింగ్ ఏకంగా 8.9/10..

Image result for Fire(1998)

7 Fire(1998)

ఈ సినిమా అప్పట్లో ఓ పెద్ద వివాదం..సినిమాను విడుదల కానిచ్చేది లేదు అని పట్టు బట్టారు భారతీయ సంస్కృతి సంఘాల వారు..ఇద్దరు ఆడవాళ్ళ మధ్య శారీరక సంబంధం ఎలా చూపిస్తారు అంటూ రచ్చ చేసారు..ఈ సమాజపు మూర్ఖత్వాన్ని ప్రశ్నించిన ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింప బడి క్లాసిక్ అనిపించుకుంది..

Image result for Sancharam(2004)

8 Sancharam(2004)

సిటీ ల్లోనే చాలామంది స్వలింగ సంపర్కాన్ని చాలా మంది విమర్శించారు..మరి పల్లెటూర్లలో ఇంకెలా ఉంటుంది పరిస్థితి..అలాంటి సెన్సిటివ్ కదాంసాన్ని మళయాళ సినిమా సంచారం లో చూపించారు..ఒక పల్లెటూళ్ళో ఇద్దరంమాయిల ప్రేమ కద ఈ సినిమా..

Image result for Mumbai Police(2013)

9 Mumbai Police(2013)

రిస్కీ కధలు సినిమా కోసం ఏమైనా చేసే నటులు..ఇవే మలయాళ సినిమా ఆస్తులు..ముంబై పోలీస్ ఓ విభిన్నమైన పోలీస్ కధ..మలయాళంలో పెద్ద హీరో అయిన పృద్విరాజ్ ఓ గే క్యారక్టర్ చేయడమే కాదు..రొమాంటిక్ సీన్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..

ఈ క్రింద వీడియో చూడండి

10 Family Album(2015)

ఇదో బెంగాలి లవ్ స్టోరీ..కానీ అమ్మాయి అబ్బాయి మధ్య కాదు..ఇద్దరు అమ్మాయిల మధ్య..మామూలుగా అయితే ఒక లవ్ స్టోరీలో కామెడీ ఎమోషన్స్ కిస్సింగ్ సీన్స్ ఎలా ఉంటాయో అవన్నీ ఇద్దరు అమ్మాయిల మధ్య ఉంటాయి..ఇదో మంచి టైం పాస్ సినిమానే కానీ బూతు సినిమా కాదు..

11 Big F

మాకు తెలిసినంత వరకు భారతీయ టివి చరిత్రలో మొట్ట మొదటిసారి ఓ లెస్బియన్ కిస్ ను చూపించిన టివి సీరీస్ ఇది..MTV లో వచ్చిన ఈ సీరీస్ లెస్బియన్ అనే స్టాంప్ టా చూపరుల దృష్టి ని ఆకర్షించింది..సినిమాలోనే కష్టం అనుకుంటే టివిలో ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం నిజంగా ధైర్యమే..

12 Dev DD

ఇది కూడా సినిమా కాదు ఒక వెబ్ సీరీస్..మొట్టమొదటి లెస్బియన్ సీరీస్ కాదు గాని ఇది ఏక్తా కపూర్ లాంటి బడా నిర్మాత నుంచి వస్తుండడంతో అంచనాలు ఎక్కువ ఉన్నాయి..ఇది వెబ్ సీరీస్ రూపంలో యు ట్యూబ్ లో టెలికాస్ట్ అయింది..కానుంది..

ఇవేనండి…మన దేశంలోని టాప్ 12 గే/లెస్బియన్ సినిమాలు..ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి…