ప్ర‌ముఖ సంగీత గాయని మృతి షాక్ లో తెలుగు సినీమా ఇండ‌స్ట్రీ

813

ప్ర‌ముఖ జానపద శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి కన్నుమూశారు. ఆమె వ‌య‌సు 99 సంవ‌త్స‌రాలు..గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలోని హ్యూస్టన్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయాదేవి.. దేవులపల్లి కృష్ణశాస్త్రికి మేనకోడలు. అనసూయాదేవికి ఐదుగురు సంతానం. ఆమె ఏయూ నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్‌ అందుకున్నారు. ఆలిండియా రేడియో ద్వారా…తెలుగు జానపద గీతాలకు ప్రాచుర్యం కల్పించారు.

ఈ క్రింది వీడియో చూడండి

జానపద, శాస్త్రీయ సంగీత గాయని, వింజమూరి అనసూయాదేవి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ అనసూయాదేవి దేశభక్తి గీతాలు, జానపదగీతాలాపనతో కళామతల్లికి సేవచేశారని కొనియాడారు. అనసూయాదేవి సోదరి వింజమూరి సీతాదేవితో కలసి వేలాది గీతాలు ఆలపించారన్నారు. అనసూయాదేవి లేని లోటు తీర్చలేనిదని అన్నారు. వింజమూరి అనసూయ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. ఆమె చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి అని నాటి జాన‌ప‌ద పాట‌లు ఇప్ప‌టికి గీతామృతాలు అని నాటి త‌రం వారు గుర్తుచేసుకున్నారు. ఇప్ప‌టి స‌మాజానికి ఆమె పాట‌లు జాన‌ప‌ద సంగీతం ఎంతో ఉప‌యోగ‌ప‌డింది అని చెబుతున్నారు. ఆమె అకాల మ‌ర‌ణంపై న‌టులు ర‌చ‌యిత‌లు గేయ క‌థా ర‌చ‌యిత‌లు నివాళులు అర్పిస్తున్నారు, ఇలాంటి మ‌హామూర్తి లేక‌పోవ‌డం బాధాక‌ర‌మని టాలీవుడ్ న‌టులు పెద్ద‌లు బాధ‌ప‌డ్డారు. ఆమె మృతిప‌ట్ల సంతాపం తెలియ‌చేసింది టాలీవుడ్, మ‌రి ఆమెకు మీరు కూడా కామెంట్ల ద్వారా నివాళి అర్పించండి.