పెళ్లి పేరుతో మోసం… నటుడి అరెస్ట్‌..

121

నేటి సమాజంలో ప్రేమ పేరుతో జంటలు తిరగడం ఆ తరువాత విడిపోవడం సర్వసాదారణంగా జరుగుతోంది..నిలక్డ నిజాయితీ లేని ప్రేమలు ప్రేమికులు కొన్ని రోజుల తరువాత విడిపోవడం ఎవరి దారి వారు చూసుకోవడం జరుగుతోంది..అయితే సినీ పరిశ్రమలో కూడా నటీ నటులు ప్రేమించుకొవడం విడిపోవడం వంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం..సాదారణ నటీ నటుల నుంచి ప్రముఖ నటీ నటులు కూడా ప్రేమించుకోవడం కొన్ని సందర్భల్లో పెళ్ళి చేసుకున్న జంటలు మరికొన్ని సందర్భాల్లో విడిపోయిన జంటలను మనం చూస్తూనే ఉన్నాం..

సినీ పరిశ్రమలో నాగర్జున అమల జీవిత రాజశేఖర్ లు ప్రేమించి పెళ్ళి చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు..తమిళ చిత్ర పరిశ్రమలో పార్తీబన్ సీత పెళ్ళి చేసుకొని కొన్నాళ్ళు కలిసి జీవించినప్పటికీ తరువాత విడిపోయారు..ఇక సాదారణ నటీ నటులు సింగర్స్ సీరియల్ నటీ నటులు ఎంతో మంది ప్రేమ వివాహాలు చేసుకొని ఆనందంగ జీవిస్తున్నారు..మరికొంతమంది ప్రేమ పేరుతో కొంతకాలం సహజీవనం చేసి ఆ తరువాత విడిపోతున్నారు..తాజాగా జరిగిన సంఘటనలో నల్గొండ జిల్లకు చెందిన ఒక నటుడు ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేసిన సంఘటనలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు..పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

ఈ క్రింది వీడియో ని చూడండి

పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన సినీ నటుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన అక్కెనపల్లి మురళీకృష్ణ అలియాస్‌ సమీర్‌ శ్రీకృష్ణానగర్‌లో ఉంటూ సినిమాల్లో నటిస్తున్నాడు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు (24)తో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేశాడు. గత నెల రోజులుగా తప్పించుకు తిరుగుతుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రేమ పేరుతో మోసం చేసిన ఈ నటుడికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..