“గీత గోవిందం” పై జక్కన్న ప్రశంసలు…

361

విజయ్ దేవరకొండ రష్మిక మందనా హీరో హీరోయిన్లుగా దర్శకుడు పరశురాం తెరకెక్కించిన గీత గోవిందం సినిమా బుదవారం విడుదలయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది…ఈ సినిమాపై రివ్యూలు కూడా అద్బుతంగా ఉన్నాయి..ఈ సినిమాను టాలివుడ్ జక్కన్న రాజమౌళి తాజాగా వీక్షించి చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..

అర్జున్ రెడ్డి తరువాత విజయ్ సరైన సినిమాని ఎన్నుకొని అద్భుతంగా నటించాడని అలాగే ఈచిత్రం ఆద్యాంతం సరదాగా సాగుతూ అలరించిందని పరశురామ్ అద్భుతంగా తెరకెక్కించాడని రాహుల్ రామకృష్ణ , అన్నపూర్ణ , వెన్నెల కిశోర్ ల కామెడీ హైలైట్ గా ఉందని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.