వామ్మో ! ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్ నిఖిత ఎవరితోనో తెలిస్తే షాక్

710

ఇండస్ట్రీలో హీరోయిన్స్ జాతకం ఒక్కొక్కసారి ఒక్కోలా మారుతుంది. కొందరు చేసింది చిన్నచిన్న సినిమాలు అయినా కొన్ని సినిమాలు అయినా అందనంత ఎత్తుకు ఎదుగుతారు. అలా ఎదిగినా వారిలో హీరోయిన్ నిఖిత ఒకరు. 2003లో హయ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈమె హీరోయిన్ గా ఎంపిక అవ్వడమే కాస్త విచిత్రం జరిగింది. ఒక హోటల్ లో నిర్మాత డి. రామానాయుడు భోజనం చేస్తుండగా నిఖితను చూశాడు. ఆమెను చుసిన వెంటనే ఇంప్రెస్ అయ్యి నిఖితకు సినిమా అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత వెంటవెంటనే తెలుగులో ఒక డజన్ సినిమాలు చేసింది.అయినప్పటికీ ఈమెకు సరైన బ్రేక్ రాలేదు. ఇక తెలుగులో సినిమాలు చేస్తూనే కన్నడ తమిళ సినిమాల మీద కూడా దృష్టి పెట్టింది.తమిళ్ లో సక్సెస్ కాలేకపోయినా కన్నడలో మాత్రం దూసుకెళ్లింది.కన్నడలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.ఇక ఈ ముద్దుగుమ్మ వివాదాలలో కూడా ముందుంది. కన్నడ హీరో దర్శన్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అందరికి అడ్డంగా దొరికిపోయింది.

Image result for టాలీవుడ్ హీరోయిన్ నిఖిత

నిఖిత తన భర్తతో అక్రమసంబంధం పెట్టుకుని..తమ కాపురం సక్రమంగా సాగకుండా చేస్తున్నదంటూ కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేశారు కూడా. దాంతో కన్నడ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ ఎదుర్కొంది. దర్శన్ కాపురంలో చిచ్చు పెడుతున్న నిఖతను మూడేళ్లపాటు ఎవరూ తీసుకోరాదంటూ తీర్మానం చేసింది.అయితే నిఖిత ఈ విషయం మీద స్పందిస్తూ… నేను గత ఆరు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. మంచి విల్ సంపాదించుకొన్నాను. అయితే ఎవ్వరితో అక్రమ సంబందాలు పెట్టుకో లేదు..అంత అవసరమూ నాకు లేదు అన్నారు. ఒక వేళ దర్శన్, అతని భార్య కు ఏవైనా ప్రాబ్లెమ్స్ ఉంటే వారినే పరిష్కరించుకోమనండి అంతే కానీ అనవసరంగా నన్ను ఎందుకు ఇందులోకు లాగారంటూ ప్రముఖ చానల్లో టెలిపోన్ లో మాట్లాడారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈమెకు సపోర్ట్ గా అప్పట్లో ఎవరు మాట్లాడలేదు. మన దర్శకదీరుడు రాజమౌళి మాత్రం నిఖితపై సపోర్ట్ గా మాట్లాడాడు.ఎవరైనా ఒక హీరోయిన్ ఒక హీరోతో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణ వస్తే..సదరు హీరోయిన్ ను చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించడం ఎంతవరకు సబబు అని ముక్కు సూటిగా ప్రశ్నించాడు. ఎవరు ఏం చెప్పిన కన్నడ నిర్మాతల మండలి నిర్ణయం మార్చుకోలేదు. ఆ తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. తెలుగులో అమాయక పాత్రలు చేసే ఈమె ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుందా అని అందరు ఆశ్చర్యపోయారు. అయితే ప్రస్తుతం ఒక పంజాబీ వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడుపుతుంది.ప్రస్తుతం ఈమెకు ఒక పాప కూడా ఉంది.దీనికి సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంది.మరి నిఖిత గురించి అలాగే ఆమె హీరో దర్శన్ తో దొరికిపోయిన విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.