హీరోయిన్ రాధిక ఉన్న హోటల్ లో బాంబ్ పేలుడు ..పరిస్థితి విషమం

269

శ్రీలంకలో మరణఖండ జరుగుతుంది. 8 చోట్ల జరిగిన బాంబ్ దాడిలో ఇప్పటికే 290 మంది గాయాల పాలయ్యారు. 500 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈస్టర్ సండే. క్రైస్తవ సామాజిక వర్గానికి పవిత్రమైన రోజు. సమస్త మానవాళికి అహింసను ప్రబోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతాడని భావించే సుదినం. అలాంటి రోజు..లంకేయులకు పీడకలను మిగిల్చింది. దశాబ్దాల పాటు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) పోరాటాలను చవి చూసిన తరువాత.. దాదాపు పదేళ్ల నుంచీ ప్రశాంత జీవనాన్ని గడుపుతున్న లంకేయులకు ఉగ్రవాదాన్ని పరిచయం చేసిన రోజు. ఎల్టీటీఈ పోరాటాన్ని పక్కన పెడితే.. ఇంత పెద్ద ఎత్తున మారణకాండ చోటు చేసుకున్న ఘటనలు బహుశా శ్రీలంక చరిత్రలోనే ఉండకపోవచ్చు.

ఈ క్రింది వీడియో చూడండి

సోమవారం ఉదయం కొలంబో విమానాశ్రయం సమీపంలో బాంబును గుర్తించిన పోలీసులు, నిర్వీర్యం చేశారు. దీంతో మరో భారీ ప్రమాదం తప్పింది. బాంబు దాడులతో శ్రీలంకలో కర్ఫూ విధించారు. జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పిలుపునిచ్చారు. ప్రధాని విక్రమ్‌సింఘే రణిల్ సైతం ఈ సమావేశానికి హాజరవుతున్నారు. శ్రీలంక జనాభా మొత్తం 2.14 కోట్లు కాగా, వీరిలో క్రైస్తవ మైనార్టీలు 6 శాతం. వీరినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకూ బాంబు పేలుళ్ల ఘటనలో 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ దాడుల వెనుక విదేశీ తీవ్రవాదుల హస్తం ఉన్నట్టు శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది. మరోవైపు, కొలంబో పేలుళ్లలో 40 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో మృతిచెందిన మరో ఇద్దరు భారతీయులను గుర్తించారు.

Image result for radhika

అయితే ఈ ప్రమాదం నుంచి టాలీవుడ్ హీరోయిన్ రాధికా తృటిలో తప్పించుకుంది.ఆమె నివసిస్తున్న హోటల్ లోనే ఒకబాంబు పేలింది. కొలంబోలోని సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బ‌స చేసిన రాధికా ఈ ఘటన జరిగే కొద్దీ నిమిషాల ముందు ఈ హెటల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారట‌. దాంతో ఆమె పెద్ద ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌న‌కి షాకింగ్‌గా ఉంద‌ని, ఇప్ప‌టికి న‌మ్మ‌లేక‌పోతున్నానంటూ రాధిక త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.రాధికా శ్రీలంకలో ఉండటంతో ఆమె భర్త శరత్ కుమార్ కంగారుపడి వెంటనే రాధికకు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నాడంట. అయితే ఇప్పుడు విమాన సర్వీసులు కూడా క్యాన్సిల్ చేశారు. దాంతో రాధికా ఇప్పుడే ఇండియా వచ్చే పరిస్థితి లేదు. మరి శ్రీలంకలో జరుగుతున్న మారనఖండ గురించి రాధికా చేసిన ట్వీట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.