టాలీవుడ్ సెక్స్ రాకెట్ పై అమెరికా కోర్ట్ సంచలన తీర్పు.. ప్రముఖులు అరెస్ట్

562

టాలీవుడ్లో సంచలనం రేపిన యూఎస్ఏ సెక్స్ రాకెట్ కేసులో అమెరికా కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కిషన్ మోదుగమూడి దంపతులను ఉత్తర ఇలినాయిస్ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో జులై 18న తుది తీర్పు వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ కేసులో వీరికి పెద్ద శిక్షే పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సాక్ష్యాలతో సహా… తెలుగు సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు తారలను కిషన్, చంద్రకళ దంపతులు అమెరికా పిలిపించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు ఫెడరల్ పోలీసులు కోర్టు ముందు సాక్ష్యాలతో సహా రజువు చేశారు.

కోర్టు ముందు ఆ వివరాలన్నీ ఐదుగురు నటీమణుల సాక్ష్యాలను, వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన డాలర్లు, వారి ప్రయాణ తేదీల వివరాలతో పాటు కిషన్ ఇంట్లో లభ్యమైన పలు కీలక సాక్ష్యాలను అమెరికా పోలీసులు కోర్టు ముందు సమర్పించారు.

జులై 18న తుది తీర్పు దీంతో పాటు వీసా నిబంధనలు ఉల్లంఘించి అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న కేసులో కూడా వీరికి శిక్ష పడనుంది. రెండు నేరాలకు కలిపి శిక్ష ఖరారు చేస్తూ జులై 18ప ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. శ
ిక్ష అనుభవించిన తర్వాతే ఇండియాకు కిషన్ మోదుగుమూడి దంపతులు అమెరికాలో శిక్ష అనుభవించిన తర్వాతే వారిని ఇండియాకు పంపనున్నారు. విసా ఉల్లంఘనలతో పాటు, వ్యభిచారం చేయిస్తున్న కేసు కూడా ఉండటంతో వీరికి పదేళ్లపైనే శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఎలా దొరికిపోయారు? అమెరికాలో జరిగే తెలుగు సంఘాల ఈవెంట్లలో పాల్గొనడానికి కంటూ సినీ తారలను బీ1, బీ2 విజిటర్ వీసాలపై రప్పించేవారు. కాలిఫోర్నియాలో జరిగే ఓ స్టార్ నైట్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు 2017 నవంబర్ 8న ఓ హీరోయిన్ చికాగో వచ్చింది. అయితే ఈవెంట్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఆమె రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా సెక్స్ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చింది.