సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న మరో ఎన్టీఆర్ షాకైన నందమూరి కుటుంబం

333

టెక్నాలజీ బాగా విస్తరిస్తున్న ఈ తరుణంలో సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలు, విశేషాలు మన ముంగిటకొస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్ క్రేజ్ నానాటికీ పెరిగిపోతోంది. దీంతో పాటు కొత్తగా స్మార్ట్ ఫోన్ యుగం రావడంతో దానికి బాగా కనెక్ట్ అయ్యారు జనం. అందుబాటులో ఉన్న రకరకాల యాప్స్ వాడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కోవలోనే అందుబాటులోకి వచ్చిన యాప్ టిక్ టాక్. ఈ యాప్‌లో పొందుపర్చిన టూల్స్ ఉపయోగించి తమకు తోచిన, నచ్చిన వీడియోలు రూపొందించి అందరి ముందుంచే అరుదైన అవకాశం లభించింది. అయితే ఈ యాప్ ద్వారా ఓ వీడియో చేశాడు షమీందర్ సింగ్ అనే ఓ యువకుడు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయన ఎన్టీఆర్‌ని పోలిఉండటం చూసి షాకవుతున్నారంతా.

ఈ క్రింది వీడియో చూడండి

మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటుంటారు పెద్దలు. ఈ వీడియో ద్వారా అది అక్షర సత్యం అని రుజువవుతోంది. అచ్చం యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగే ఉన్న ఈ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ స్టైల్ లోనే అదే గడ్డంతో ఇందులో కనిపిస్తున్న పంజాబ్ యువకుడు షమీందర్ సింగ్‌ని చూసి ఎన్టీఆర్ అని పొరపాటు పడుతున్నారంతా. చివరకు ఆయన ఎన్టీఆర్‌లా ఉన్న మరో మనిషి అని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.నా పేరు షమీందర్ సింగ్. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. మాది పంజాబ్. నాకు తెలుగు రాదు. కానీ, తారక్‌ను కలవాలని చాలా ప్రయత్నిస్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను చూసి సోషల్‌మీడియాలో తెగ మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకోసం నేను మా పంజాబీ డ్యాన్స్ చేసి చూపిస్తాను” అని ఈ వీడియో ద్వారా షమీందర్ సింగ్ తెలిపాడు.

తారక్ అంటే పడిచచ్చే ఆ యువకుడికి తారక్‌ని కలవడానికి హైదరాబాద్‌కు వచ్చేయాలనుందట కానీ ఎక్కడ తారక్ అభిమానులు నిజంగానే ఎన్టీఆర్ వచ్చారనుకుని తన వెంటపడతారోనని భయపడుతున్నాడట. కాబట్టి తారక్ నటించిన ఎన్నో సినిమాల్లోని డైలాగ్‌లను అనుకరిస్తూ ఎన్టీఆర్ సన్నిహితుడైన నిర్మాత మహేశ్ కోనేరును ట్యాగ్ చేస్తూ షమీందర్ పలు వీడియోలు ట్వీట్స్ చేస్తున్నారు షమీందర్. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి అచ్చం తనలాగే ఉన్న ఎన్టీఆర్ ని, ఈ వీడియోల్ని తారక్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతారనేది.ఇక ఇటీవలే అరవింద సమేత సినిమాతో హిట్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయపడటం వలన సినిమా షెడ్యూల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.