బ్రహ్మానందం ఇంటికి భారీగా తరలివస్తున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు..ఏమైందో తెలిస్తే షాక్

685

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. హాస్య బ్రహ్మ అని ఆయనకు పేరు. బ్రహ్మానందం ఫేస్ చూస్తే చాలు నవ్వడం ఖాయం. తెరపై ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు, చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సరదాగా కాసేపు హాయిగా నవ్వుకోవడానికి చాలామంది బ్రహ్మానందం వీడియో క్లిప్పింగ్స్ చూస్తారంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.టాలీవుడ్‌లో బ్రహ్మానందంకు పోటీ లేరు అనే పేరు సంపాదించారు. దాదాపు మూడు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలిన బ్రహ్మానందం పేరు వింటేనే చాలు వెంటనే మనసు లోతుల్లోంచి పెదాలపై నవ్వు వచ్చేస్తుంది. అంతలా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు.

Related image

అయితే ఆ నవ్వు ఇప్పుడు చాలా బాధలో ఉంది. ఆయనకు ఈ మధ్యనే ముంబైలో గుండె ఆపరేషన్ అయినా సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ డాక్టర్స్ ఈ ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని ఎన్నో రూమర్స్ వినిపించారు. దాంతో బ్రహ్మానందం కొడుకు స్పందించి కొన్ని కారణాల వలన హార్ట్ సర్జరీ అయ్యిందని వెంటనే చేయిస్తే కోలుకుంటాడని తెలిసి ముంబై తీసుకొచ్చి హార్ట్ సర్జరీ చేయించాము. తొందర్లోనే నాన్నగారు కోలుకుంటారని ఫాన్స్ దిగులు పడవద్దని బ్రహ్మానందం కొడుకు గౌతమ్ మీడియాకు చెప్పాడు. దాంతో ఫాన్స్ ఆందోళనకు అలాంటి తప్పుడు ప్రచారాలకు పులుస్టాప్ పడింది.

బ్రహ్మ్మనందం అందరిని నవ్వించే వ్యక్తి. అలంటి బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని అందరు కోరుకున్నారు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత బ్రహ్మానందం ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. హార్ట్ సర్జరీ తరువాత ఎక్కువగా మాట్లాడని బ్రహ్మానందం ఇప్పుడు కొంచెం బాగానే మాట్లాడుతున్నాడంట. ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారని సమాచారం.తనతో నటించిన తోటి నటీనటులు కొందరు టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్స్ అందరు వెళ్లి పరామర్శించారు. ముఖ్యంగా బ్రహ్మానందానికి ఎంతో క్లోజ్ అయినా మోహన్ బాబు వెళ్లి పలకరించారంట. ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన వీరి మధ్య ఎంతో సన్నిహితం ఉంది. అందుకే వెళ్లి పలకరించి వచ్చారంట. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వెళ్లి బ్రహ్మానందాన్ని కలిసి ఆయన ఆరోగ్యం కూడా అడిగి తెలుసుకున్నారట. బ్రహ్మానందం త్వరగా కోలుకుని మళ్ళి సినిమాలలో నటించాలని మనం కూడా కామెంట్ రూపంలో కోరుకుందాం.