తన ప్రేమకథను వివరించిన పవన్ కళ్యాణ్ సోదరి..పవన్ కళ్యాణ్ తో అలా…

488
పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రాన్ని ఎప్పటికి మరిచిపోలేం. ఆ చిత్రంలో పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి కూడా అభిమానులందిరికి ఎప్పటికి గుర్తుంటుంది.తొలిప్రేమ చిత్రంతో పరిచయం అయిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని వాసుకి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజగా వాసుకి తన ప్రేమ సంగతులు వివరించింది.
తొలి ప్రేమ చిత్రానికి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు.షూటింగ్ సమయంలో తమ మధ్య స్నేహం ఏర్పడిందని వాసుకి తెలిపింది. సరదాగా మాట్లాడుకుంటుతూనే స్నేహితులుగా మారిపోయాం అని తెలిపింది.షూటింగ్ అయిపోయాక ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం.సరదా విషయాలతో పాటు, సినిమా సంగతులు కూడా ఆనంద్ నాకు చెప్పేవారు.అందరిలాగా ప్రేమిస్తున్నాను అంటూ ప్రపోజ్ చేయలేదు, నేరుగా పెళ్లి ప్రస్తావనే తీసుకుని వచ్చాడు. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడాడు.
ఆనంద్ సడెన్ గా పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చేసరికి నేను తీసుకోలేకపోయా.ఆనంద్ ఎప్పుడూ ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించలేదు.వెంటనే నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పేశా.బలవంతం ఏమీ లేదని ఫోన్ పెట్టేశాడు. రెండు రోజులు ఫోన్ చేయలేదు. ప్రతి రోజు ఫోన్ లో మాట్లాడే వ్యక్తితో రెండు రోజులు మాట్లాడక పోయేసరికి నాకు ఏదోలా అనిపించింది.ఆ తరువాత నేనే ఆనంద్ కు ఫోన్ చేశా. ఎందుకు ఫోన్ చేయలేదు అని అడిగా. నువ్వు ఇబ్బంది పడతావేమో అని చేయలేదు అని అన్నాడు. మనమిద్దరం స్నేహితులమే కదా అని అన్నాడు.
పెళ్లి ప్రస్తావన వచ్చాకా నేను స్నేహితుడిగా ఉండలేను అని తెలిపాడు. ఆ తరువాత మళ్ళి 15 రోజులు మాటలు లేవు.ఎక్కువ రోజులు ఆనంద్ తో మాట్లాడకపోయే సరికి అతడిని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కలిగింది. స్నేహితులని అడిగితే పెళ్ళికి అంగీకరించమని సలహా ఇచ్చారు. దేవుడికి ప్రార్థించి ఆనంద్ కు ఫోన్ చేసి ఓకె చెప్పేశా అని తన ప్రేమ కథని వాసుకి వివరించింది.పవన్ కళ్యాణ్ నాకు చాలా మంచి స్నేహితుడు. షూటింగ్ లో పవన్ కళ్యాణ్, ఆనంద్ ఇద్దరూ కలసి తనని ఆటపట్టించేవారని వాసుకి తెలిపింది.