ఈ వారం బిగ్ బాస్ నుండి శ్యామల అవుట్ బిగ్ బాస్ సీక్రెట్ లీక్

407

తెలుగులో కాస్త మ‌సాలా, కాస్త ఎంట‌ర్ టైన్ మెంట్ ,ఫ‌న్నీ టాస్క్ మైండ్ గేమ్స్ తో, ఇంట్ర‌స్టింగ్ గా సాగుతోంది బిగ్ బాస్ షో.. ఇక ఇప్ప‌టికే ఫైన‌ల్ స్టేజ్ కు వ‌చ్చింది ..మ‌రో రెండు వారాల్లో బిగ్ బాస్ హౌస్ లో విన్న‌ర్ ఎవ‌రో తేలిపోనుంది.. దీంతో నామినేష‌న్స్ ఎలిమినేష‌న్స్ పై అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు.. ఈ స‌మ‌యంలో షో గురించి మ‌రో న్యూస్ వైర‌ల్ అవుతోంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బిగ్ బాస్ లో మరో సంచలనానికి రంగం సిద్దంకాబోతున్నట్లు తెలుస్తోంది. గత వారం డబుల్ ఎలిమినేషన్స్ లో భాగంగా గణేష్, నూతన్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడే ఎవరికీ అంతు చిక్కని ఒక విషయం జరిగింది. ఓట్లు తక్కువగా వచ్చిన కారణంగా గణేష్ ని మొదటగా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాని. ఇంతవరకు అంతా బాగున్నా ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న నూతన్ ని ఎలిమినేట్ చేయడం పెద్ద చర్చకి దారి తీసింది. నూతన్ కి ఓట్లు ఎక్కువగా వచ్చినా రీ రీ ఎంట్రీ అని ఒక సాకుని చూపించి నూతన్ ని హౌస్ నుండి బయటకి పంపించారు.

Image may contain: 1 person, smiling, sitting, close-up and indoor

అలాగే నూతన్ నాయుడు ని ఇంట్లో నుండి బయటకి పంపడానికి మరో ముఖ్య కారణం కౌశల్ కి సపోర్ట్ గా ఉన్నాడని.. కౌశల్ ని ఇంటి సభ్యులే కాదు బిగ్ బాస్ కూడా వ్యతిరేకిస్తున్నాడని అందరికి తెలిసిందే.. దీంతో నూతన్ ఇంట్లో ఉంటే కౌశల్ మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని గమనించిన బిగ్ బాస్ నూతన్ ని బయటకిపంపించారు… నూత‌న్ ని రీ ఎంట్రి అని చెప్పి బయటికి పంపినవారు, అసలు నూతన్ నాయుడుని హౌస్ లోకి ఎందుకు అన్ని సార్లు పంపించారో ఎవరికీ అంతు చిక్కడంలేదు.

Image may contain: 1 person, smiling, standing and dancing

ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం నామినేషన్స్ లో కౌశల్, దీప్తి, శ్యామల, అమిత్ లు ఉన్నారు. కౌశల్ కి కౌశల్ ఆర్మీ సపోర్ట్ ఉంది కాబట్టి కౌశల్ ని ఇంటి నుండి బయటకి పంపడం కష్టమే. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే అమిత్ చివరి ప్లేస్ లో ఉన్నాడు కానీ ఈ వారం మరో సంచలనాత్మక మైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. నూతన్ లాగే రీ ఎంట్రీ ఇచ్చిన శ్యామల ని ఈ వారం ఎలిమినేట్ చేస్తారని తెలుస్తోంది.. శ్యామల ని ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ చూపబోయే కారణం కూడా ప్రచారంలోకి వచ్చింది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బయట విషయాలని ఇంటి సభ్యులతో చెప్పకూడదు.. కానీ శ్యామల మాట్లల్లో పడి బయటి విషయాలని చెప్పేసింది. దీంతో రూల్స్ పాటించనందుకు శ్యామల ఈ వారం ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తోంది.. సో రీ ఎంట్రీ ఇచ్చినా వీరు ఇద్ద‌రూ హౌస్ లో ఫెర్ఫామెన్స్ ఏమీ చేయ‌క‌పోవ‌డం కూడా ప్రేక్ష‌కుల‌కు పెద్ద ఆస‌క్తిని క‌లిగించ‌లేదు. మ‌రి మీ ఉద్దేశం ప్ర‌కారం, శ్యామలా హౌస్ ని వీడుతుంది అని భావిస్తున్నారా. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.