బిగ్ బాస్ 3 లో హాట్ భామ.. శ్రీముఖికి పోటీగా! యూత్‌కి పండగే..

132

స్టార్ మా నిర్వహణలో బిగ్ బాస్ రియాల్టీ షో చేసిన హంగామా అంతాఇంతా కాదు. బిగ్ బాస్ తొలి సీజన్ ,మలి సీజన్ లలో కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ గా వ్యవహరించినవాళ్లు కూడా తమ ఉనికిని చాటుకున్నారు. అందుకే బిగ్ బాస్ టి ఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే, సీజన్ టుని నేచురల్ స్టార్ నాని నడిపించాడు. ఈ రెండు సీజన్స్ లో వచ్చిన లోపాలను సవరిస్తూ మూడో సీజన్ ని పక్కాగా నిర్వహించడానికి స్టార్ మా యాజమాన్యం కసరత్తు ప్రారభించింది. సీజన్3 మరికొన్ని రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు.ఇప్పటికే నాగార్జునను హోస్ట్‌గా ప్రకటిస్తూ ప్రోమోలు విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. 100 రోజుల పాటు సాగనున్న ఈ షోలో పార్టిసిపెంట్స్ ఎవరనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హౌజ్‌లోకి ప్రవేశించే కంటెస్టెంట్ల గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. హేమచంద్ర, ఉప్పల్ బాలు, ఉదయభాను, శ్రీముఖి, ‘తీన్మార్’ సావిత్రి ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. దీనికి సంబంధించి సావిత్రి, శ్రీముఖిలతో సంప్రదింపులు కూడా జరిగాయని, అందుకే శ్రీముఖి పటాస్ షోని, సావిత్రి తీన్మార్ షోని వదులుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరొకరి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు హాట్ బ్యూటీ హెబ్బాపటేల్ ఈ షోలో భాగం కానుందని తెలుస్తోంది. కుమారి 21F సినిమాతో కుర్రకారు గుండెల్లో గ్లామర్ బ్యూటీగా స్థిర పడిపోయింది హెబ్బా పటేల్. ఆ తర్వాత అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని పలు సౌత్ సినిమాల్లో గ్లామర్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది హెబ్బా. దీంతో అమ్మడికి యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

Image may contain: 1 person

హెబ్బా ఉందంటే సెగలు పుట్టించడం ఖాయం అని ఫిక్సయ్యాయారంతా. అయితే తాజాగా బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్ లిస్ట్ లో హెబ్బా పటేల్ పేరు వినిపిస్తుండటంతో అందం, అట్రాక్షన్ పరంగా హాట్ యాంకర్ శ్రీముఖికి హెబ్బాపటేల్ పోటీగా నిలుస్తుందనే టాక్ మొదలైంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు హెబ్బాపటేల్ తో సంప్రదింపులు కూడా చేశారని సమాచారం అందుతోంది. ఇదే జరిగితే బుల్లితెర యూత్ ఆడియన్స్‌కి పండగే మరి. బుల్లితెర ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈ నెలాఖరులో బిగ్ బాస్ సీజన్ 3 పేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే సీజన్ 3 కనిస్టెంట్స్ విషయంలో వస్తున్న వార్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.