సైరాలో అనుష్క పాత్ర ఇదే. అద్భుతం..

284

రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నoటాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్‌ చేశారు. . మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సైరా ఎట్టకేలకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతూ బ్రిటీష్ వారి ప్రవేశం, వారి ఆగడాల గురించి చెప్తాడు. ఇక నరసింహ రెడ్డి కథలోకి తీసుకెళ్లేందుకు తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో చిన్న సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్తాడు. చిరు ఎంట్రీ మాత్రం మెగా అభిమానులను కట్టిపడేస్తుంది అంటున్నారు. ఇక జాతర సాంగ్ తెరపై చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేంత అద్భుతంగా తెరకెక్కించారు. నయనతార, తమన్నా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లకు మంచి పాత్రలు లభించాయి.

Image result for anushka character in sye raa

అయితే ఈ సినిమాలో ఒక సస్పెన్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే అనుష్క ఎంట్రీ. ఈ సినిమాలో అనుష్క ఉందని మొదటి నుంచి వార్తలు వచ్చినా కూడా ఆమెకు సంబందించిన ఎలాంటి పోస్టర్ గాని, వార్త గాని బయటకు రాలేదు. ఈ సినిమాలో అనుష్క ఝాన్సీ రాణి లక్ష్మీ బాయిగా నటించింది. స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప రాణి లక్ష్మి బాయ్. సినిమాలో 10 నిమిషాల పాటు అనుష్క ఉంటుంది. వీరా రెడ్డి పోరాటాన్ని ఆపాలని చుస్తే..పోరాటాన్ని ఆపే హక్కు నీకెవ్వరూ ఇచ్చారు. తలలు తెగిపడ్డ చేతిలో కత్తి వదలకూడదు. యుద్ధంలో ప్రాణాలు వదిలినవాడు వీరుడితో సమానం అని అనుష్క చెప్పే డైలాగ్ ఆడియన్స్ తో ఈలలు వేసేలా చేసింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక ఫస్ట్ హాఫ్ ను నిలబెట్టింది ఇంటర్వెల్ సీన్ అని ముక్తకంఠంతో చెప్పాలి.. ఈ సీన్స్ తో ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఇక సెకండ్ హాఫ్ లో మొదట్లో నరసింహా రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అవుక రాజు సుదీప్ తిరిగి చేతులు కలపడానికి వస్తాడు. బ్రిటీష్ వారిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సైన్యాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ క్రమంలో వచ్చే సైరా సాంగ్ తెరపై ఇంతకుముందెన్నడు చూడని విధంగా ఉంటుంది. ఈ పాటను విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇక నరసింహా రెడ్డిని వెన్నుపోటు పొడిచేది ఎవరు, బ్రిటీష్ వారికి చిక్కిన తమన్నా కథ ఏం అవుతుంది, ఇలాంటి ట్విస్టులెన్నో సెకండాఫ్‌ను మరింత ఆసక్తికరంగా మలుస్తాయి. ఇక చివరి నలభై నిమిషాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.. క్లైమాక్స్ అదిరిపోయింది… ప్రతి ఒక్కరి గుండెను కదిలిస్తుంది. మెగాస్టార్ ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో గుర్రపు స్వారీలు, యుద్ధ సన్నివేశాలు చేయడంలో హైలెట్. తన నటనతో మరోసారి విజృంభించాడని అభిమానులు సంబర పడుతున్నారు. ఇక గురువుగా నటించిన అమితాబ్ కనిపించేది కొన్ని సీన్స్‌లోనే అయినా ఎంతో ప్రభావం చూపించారు. ఇలా చెప్పుకుంటూపోతే సినిమా మొత్తం అద్భుతంగ ఉంది. ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి తెలుగువాడు చూడాల్సిన సినిమా ఇది. మరి సైరా సినిమా మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.