ఐటమ్ సాంగ్స్ రాసేముందు ఆలోచించండి సీనియ‌ర్ న‌టి

334

ఇప్పుడు ఏ సినిమా ఇండ‌స్ట్రీలో కొత్త సినిమాలు వ‌స్తున్నా అందులో క‌చ్చితంగా ఐటెంసాంగ్ ని ఎక్క‌డో చోట ఉండేలా పెట్టుకుంటున్నారు.. ఐటెంసాంగ్ కావాలి అని ద‌ర్శ‌కుడు అడుగుతున్నారు… నిర్మాత అడుగుతున్నారు.. ఇలా అయిపోయింది చాలా సినిమాల్లో ప‌రిస్దితి.. ఐట‌మ్ సాంగ్ కోసం కోట్ల‌రూపాయ‌లు ఖ‌ర్చు కూడా చేస్తున్నారు.. తాజాగా ఈఐటం సాంగ్ వ్య‌వ‌హారం పై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ షబానా ఆజ్మీ ఖండించారు..

Image result for షబానా ఆజ్మీ
సినిమాల్లో ఇలాంటి సాంగ్స్ పెట్ట‌డం పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు ఇలాంటి పాట‌లు రాసేవారు ఒక‌టిరి రెండు స్లారు ఆలోచించాల‌ని ఆమె తెలియ‌చేశారు… ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ నేను సినిమాల్లో చూపించే ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. ఇటువంటి పాటల్లో వినియోగించే పదాలు చాలా అవమానకరంగా ఉంటున్నాయి… మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి.. అందుకే ఇలాంటి సాంగ్స్ సినిమాల్లో పెట్ట‌కూడ‌దు అని ఆమె అన్నారు.