రాజ‌మౌళీ ప్రాజెక్టులో హీరోయిన్స్ వీరేనా

394

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి జ‌క్కన్న తెర‌కెక్కించ‌బోయే నెక్ట్స్ సినిమా ఏమిటా అని ప్రేక్ష‌కుల్లో ఒక‌టే ఆలోచ‌న ఉండేది.. అయితే ఎన్టీఆర్ చ‌ర‌ణ్ తో ఓ బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని ఎప్పుడైతే రాజ‌మౌళి రివీల్ చేశారో.. అప్ప‌టి నుంచి ఎంతో స‌స్పెన్స్ ఈ సినిమా పై నెల‌కొంది.. ఈ సినిమాలో ఎవ‌రు ఎవ‌రు న‌టిస్తారు, అలాగే చెర్రీ – ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే ముద్దుగుమ్మ‌లు ఎవ‌రు అని అంద‌రూ అనుకున్నారు.. అలాగే జ‌క్క‌న్న బాలీవుడ్ నుంచి వీరి ఇద్ద‌రికి హీరోయిన్ల‌ను సెల‌క్ట్ చేస్తారు అని భావించారు.

Image result for keerthi suresh

 

ఆర్‌.ఆర్‌.ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం ఓ వార్త వైర‌ల్ అవుతోంది టాలీవుడ్ లో.. ఈ సినిమాని సెప్టెంబ‌ర్ నెల నుంచి ప‌ట్టాలెక్కించ‌నున్నారు అనే విష‌యం తెలిసిందే.. ఇటు చెర్రీ ఎన్టీఆర్ త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు.. అయితే ఈసినిమా పై అనేక వార్త‌లు ఇప్ప‌టికే వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమాలో న‌టించే హీరోయిన్ల గురించి వార్త‌లు వ‌స్తున్నాయి.

Image result for pooja hegde

ఈ సినిమాలో తారక్ చ‌ర‌ణ్ కు జోడిగా ఎవ‌రు అనే వార్త‌కు ఓ పోస్టు వైర‌ల్ అవుతోంది.. ఎన్టీఆర్ కు కీర్తిసురేష్, అలాగే చెర్రీకి పూజా హెగ్డేలు హీరోయిన్లుగా ఫైన‌ల్ అయ్యారు అని అంటున్నారు.. ఈ సినిమా స్వాతంత్య్ర‌ సమరం నాటి కథ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ప్రకటన రాలేదు. మ‌రీ ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఇప్ప‌టికే మంచి ఫామ్ లో ఉన్నారు.. అందుకే ఈన్యూస్ క‌రెక్ట్ అంటున్నారు కొంద‌రు అభిమానులు, టాలీవుడ్ జ‌నాలు..