వీళ్లు నిజంగా కేర‌ళ‌కు ఎంత సాయం ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు అదంతా ఫేక్

482

పెట్టకపోయినా పెట్టే ఇంటిని చూపమన్నారు.. అని సామెత వరద బాధిత కేరళ విషయంలో నెటిజన్లు ఈ సూత్రాన్ని చక్కగా పాటిస్తున్నారు. సెలబ్రిటీలతో కళ్లు బైర్లు కమ్మేలా కోట్ల కోట్ల కోట్ల విరాళాలు ఇప్పిస్తున్నారు. తాము విరాళం ఇవ్వకపోయినా సెలబ్రిటీలతో బలవంతంగా ఇప్పించి బహు సంతోషిస్తున్నారు. నిజంగా మీరు విన్న‌ది వాస్త‌వం.. ఇదేంటి సెల‌బ్రెటీలు కోట్లరూపాయ‌లు ఇస్తున్నారు అనిపోస్టులు వ‌స్తున్నాయి అని అనుకుంటున్నారా.. అస‌లు వారు ఇచ్చింది ఎంత ఇవ్వాలి అనుకుంటుంది ఎంత అనేది కూడా సోష‌ల్ మీడియాలో వారి అభిమానులు తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఓసారి ఆ వైర‌ల్ వార్త‌ల్లో వాస్త‌వం ఎంత ఉంది అనేది తెలుసుకుందాం.

Image result for kerala flood tamil vijaya

శృంగార తార సన్నీ లియోన్ విరాళం రూ. 5 కోట్లు, తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ రూ. 14 కోట్లు, పోర్చుగీసు ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్తియానో రొనాల్డో అయితే ఏకంగా రూ. 77 కోట్లు.. !! ఆయన ఇన్నేసి కోట్లు, ఈమె ఇన్నేసి కోట్లు..!! ఇదీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం. సదరు ‘దాతలు’ తాము విరాళం ఇచ్చామని ఒక్క ప్రకటన చేయకున్నా అభిమానులు, ఆకతాయిలు వాళ్ల పేర్లతో దానాలు చేసిపారేస్తున్నారు. దీంతో లైకులే లైకులు. కోట్లు దండుకునే దీపికా, ఐశ్వర్యా రాయ్ వంటి సన్నీని చూసైనా కాస్త విరాళం ఇవ్వాలని పాఠాలు..నిజంగా ఇందులో చెప్పిన వారు ఒక్క‌రూ కూడా ఇంత భారీ విరాళం ఇవ్వ‌లేదు కేవ‌లం వారి అభిమానులు ఆక‌తాయిలు సృష్టించిన వైర‌ల్ ప్ర‌చారం.. అలాగే అత్య‌ధికంగా ఇచ్చిన వీరిని చూసి మ‌న వాళ్లు బుద్దితెచ్చుకుని అందులో కొంతైనా సాయం చేయాలి అని చెప్పేలా పోస్టులు పెడుతున్నారు..

Image result for kerala flood sunneylenonసన్నీ లియోన్ నిజంగానే 5 కోట్లు ఇచ్చిందా అని కొన్ని మీడియా సంస్థలకు అనుమానమొచ్చి ఆమె సిబ్బందిని అడిగారు. దానికి వారిచ్చిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. ‘ఆమె ఇలాంటి వ్యక్తిగత విషయాలను బయటికి చెప్పరు. సాయం గురించి ఇతరులకు చెప్పరు. బాధితులు తరఫున ఆమె ప్రార్థన చేశారు.. ఆమె ఐదు కోట్లు ఇచ్చినట్లు మీకెవరు చెప్పారు?’ అని ఎదురు ప్రశ్నించారు. ఇక విజయ్ విషయం కూడా అంతే. తాను 14 కోట్లు ఇచ్చినట్లు అతడు ఎక్కడా చెప్పలేదు. విజయ్ 5 లక్షలు ఇచ్చాడని వారం కిందట వార్తలొచ్చాయి. ఐదు ల‌క్ష‌లు ఇస్తే 14 కోట్లు అని ప్ర‌చారం చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దళితుడైన విజయ్ అన్ని కోట్లు ఇచ్చాడని, ఇతర కులాల హీరోలు ఏం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఈ కోట్లకోట్ల విరాళాలను చూసి కొందరైతే తాము వంద కోట్లు ఇచ్చామని కొందరు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు.. ఏదో సామెత చెప్పినట్టు.. పెట్టినమ్మ పుణ్యాన పోదు, పెట్టనమ్మ పాపాన పోదు.. ఎవరి కోట్లు వాళ్లిష్టం..కానీ ఇది తమాషాలు, జోకులు వేయాల్సిన సందర్భం మాత్రం కాదని గుర్తించుకుంటే చాలు.. వాస్త‌వాలు చూస్తే ఇంత పెద్ద మొత్తంలో ఎవ‌రూ కేర‌ళ బాధితుల‌కు విరాళాలు ఇవ్వ‌లేదు అర‌బ్ కంట్రీ 700 కోట్లు ఇచ్చిన మాట వాస్త‌వం అలాగే ప‌లు కంపెనీలు కోట్ల రూపాయ‌ల విరాళం ఇచ్చిన మాట వాస్త‌వం ఇక‌నైనా ఇలాంటి ప్ర‌చారాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాలి అని కోరుకుంటున్నారు చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.