షాకింగ్ న్యూస్: పవన్ ఫామ్ హౌస్ దగ్గర మహిళ దారుణ హత్య.. ఏమైందంటే?

372

దేశంలో ఎక్కడ చుసిన హత్యలు అత్యాచారాలే జరుగుతున్నాయి.ఆడపిల్ల ఒంటరిగా కనపడితే చాలు అత్యాచారం చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు కామాంధులు.అలాగే వివిధ కారణాల వలన ఒకరిని ఒకరు హత్య చేసుకుంటున్నారు.తల్లిదండ్రి కొడుకు కూతురు అన్న వరుసలు కూడా లేకుండా ఒకరిని ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు.ఇప్పుడు ఒక మహిళా హత్య జరిగింది.అది కూడా పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ దగ్గర జరిగింది.మరి ఆ హత్యకు సంబందించిన పూర్తీ వివరాలు తెలుసుకుందామా.

Image result for pawan kalyan and nara lokesh

తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ దగ్గరలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ఒక మహిళ దారుణంగా హత్య గావించబడింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ శివారులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది..అయితే అక్కడ నివశిస్తున్న స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఈ హత్య వారం క్రితం రోజుల కిందట జరిగి ఉండవచ్చని , మరియు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హోస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విచారణ చేపట్టిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. కాగా అందులో బాగంగా అసలు ఇంతకీ ఆ మహిళ ఎవరు ? అక్కడ ఎందుకు హత్య కి గురైంది. అసలు ఆమెను ఇంత కిరాతకం గా చంపాల్సిన అవసరం ఎవరుకుంది . అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . అంతేగాక ఫామ్ హౌస్ కి దగ్గర్లో ఉన్న నిఘా కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఘటన కి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది.మరి ఈ హత్య గురించి మీరేమంటారు.గుర్తుతెలియని ఈ మహిళ హత్య గురించి అలాగే దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న దారుణాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.