సైరాకు బాలీవుడ్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు

401

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.. క్రియేటివ్ ద‌ర్శ‌కుడు సురేంద్ర రెడ్డి ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కోలీవుడ్ న‌టులు న‌టించ‌డంతో ఈ సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెరుగుతున్నాయి…ఇటు ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొంద‌డం అలాగే సినిమాలో పెద్ద పెద్ద న‌టులు ఉండ‌టంతో అంద‌రూ ఈ సినిమాపై ఎన్నో హూప్స్ పెట్టుకున్నారు.

Related image

ఇక రామ్ చ‌రణ్ ఈ సినిమాని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ లోనిర్మిస్తున్నారు..సైరాలో చిరంజీవి, అమితాబ్ కు సంబంధించిన రోల్ గెట‌ప్ ఫోటోలు గ‌తంలో బ‌య‌టకు వ‌చ్చాయి.. దీంతో ఈ సినిమా పై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు చిత్ర‌యూనిట్ . ఈ సినిమాకి ముందు ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తారు అని అనుకున్నారు… అయితే ఆయ‌న ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు.. త‌ర్వాత టాలీవుడ్ లో త‌మ‌న్ పేరు కిర‌వాణి పేరు ఈ సినిమాకి మ్యూజిక్ ద‌ర్శ‌కులిగా ఫిక్స్ అయ్యారు అని వార్త‌లు వచ్చాయి.

Image result for amit trivedi music director

కాని వారి పేరు చిత్ర యూనిట్ అధికార‌కంగా ప్ర‌క‌టించ‌లేదు.. ఇప్పుడు ఫైన‌ల్ గా బాలీవుడ్ మ్యూజిక్ మాంత్రికుడు ఫిక్స్ అయ్యార‌ట ఇప్పుడు తాజాగా ఈ వార్త‌లు వినిపిస్తున్నాయి… ఆయ‌న బాలీవుడ్‌ లో థ్రిల్లర్‌, ఎమోషనల్‌ డ్రామాలకు సంగీతమందించిన అమిత్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి…మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వెయిట్ అండ్ సీ.