హరికృష్ణ సంపాదించిన ఆస్తుల విలువ తెలిస్తే షాక్!

617

నంద‌మూరి వారి ఇంట హ‌రికృష్ణ దుర్మ‌ర‌ణంతో విషాదం అల‌ముకుంది.. అభిమానులు, పెద్ద‌లు, రాజ‌కీయనాయ‌కులు, పారిశ్రామిక వేత్తలు సిని ప్ర‌ముఖుల‌తో హ‌రికృష్ణ నివాసం ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున జ‌నం ఉన్నారు.. ఆయ‌న మ‌ర‌ణించారు అని తెలియ‌గానే ఆయన కుటుంబ స‌భ్యులు వారి ఇంటికి చేరుకున్నారు.. ఇంటికి పెద్ద‌గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న అన్న‌య్య లేడు అని ఇటు చెల్లెలు పురందేశ్వ‌రి కూడా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు….హ‌రికృష్ణ మ‌ర‌ణంతో ఇప్పుడు నంద‌మూరి వారి ఇంట విషాద‌చాయ‌లు అల‌ముకున్నాయి. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున నాయ‌కులు పెద్ద ఎత్తున వ‌స్తున్నారు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆయ‌న త‌న‌యుడు మంత్రి నారాలోకేష్ ఇప్ప‌టికే ఆయ‌న కుటుంబాన్ని ఓదార్చారు… మంత్రి కేటీఆర్ కూడా ఆయ‌న అంతిమ సంస్కారాలు ప్ర‌భుత్వం చేస్తుంది అని తెలియ‌చేశారు.

Related image

ఇక ఎన్టీఆర్ త‌న‌యుడిగా పేరు తెచ్చుకుని త‌న‌కంటూ ఓ మార్క్ సంపాదించుకున్నారు హ‌రికృష్ణ‌,.. ఇప్ప‌డు ఆయ‌న గురించి అనేక వార్త‌లు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.. ఆయ‌న ఇష్టా ఇష్టాల నుంచి ఆయ‌న ఏం చేసేవారు, రాజ‌కీయంగా ఏం ప‌ద‌వులు చేశారు… ఏఏ సినిమాల్లో న‌టించారు ఇవ‌న్నీచ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.. ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత వారి కుమారులు ఎవ‌రికి వారు విడిపోయారు. ఇక ఎన్టీఆర్ ఉన్న స‌మ‌యంలో అనేక‌ ఆస్తులు ఉన్నాయి. వాటిని ఎవ‌రికి వారు పంచుకున్నారు అంటారు. ఇప్పుడు హ‌రికృష్ణ చేతిలో నాలుగు క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి అని ..ఓ 50 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉంది అని తెలుస్తోంది.

Image result for hero hari krishna house

ఆయ‌న పెద్ద వ్యాపారాలు చేయ‌లేద‌ని సాధార‌ణ జీవితం అల‌వ‌ర‌చుకున్నారు అని అంటారు… ఇక ఆయ‌న కుమారుడు సినిమా రంగంలో అలాగే వ్యాపారాలు చేసి కాస్త స్దితిమంతులు అయ్యారు.. ఇక క‌ల్యాణ్ రామ్ జాన‌కి రామ్ కూడా ఇలా వ్యాపారాలు చేస్తున్నారు. ఆయ‌న మాత్రం వాటిజోలికి వెళ్ల‌లేదు అని స‌న్నిహితులు చెబుతున్నారు.. తండ్రికి ఏ లోటూ రాకుండా చూసుకోవ‌డంలో ఇటు అన్న‌య్య క‌ల్యాణ్ రామ్ త‌మ్ముడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ముందు ఉంటారు.. ఎటువంటి ఫంక్ష‌న్ పండుగ ఇంట్లో వ‌చ్చినా తార‌క్ కల్యాణ్ రామ్ ద‌గ్గ‌ర ఉండి మ‌రీ చూసుకుంటార‌ని, ఇప్పుడు అన్న జాన‌కిరామ్ కుమారుల‌ను కూడా బాగా చూసుకుంటున్నారు అని అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాని హ‌రికృష్ణ లేని లోటు ఆకుటుంబానికి తీర్చ‌లేనిది. ఇటు ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్ప‌టికీ హ‌రికృష్ణ బాల‌కృష్ణ పేర్లు వినిపిస్తాయి. అన్న‌య్య మ‌ర‌ణంతో బాల‌కృష్ణ కూడా తీవ్రంగా బాధ‌ప‌డ్డారు. ఉద‌యం నుంచి అక్క‌డే అన్న కుటుంబంతో బాల‌య్య ఉన్నారు.మొత్తానికి సినిమా రంగంలో రాజ‌కీయంగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు, కాని ఆర్ధికంగా కోట్ల రూపాయ‌ల ఆస్తులు అయితే కూడ‌బెట్ట‌లేదు అని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు.. ఇప్పుడు త‌న కుమారులు వ్యాపారాలు సినిమాల‌తో మంచి ఉన్న‌త స్ధితిలో ఉన్నారు అని త‌న స‌న్నిహితుల‌కు సంతోషంగా చెప్పేవార‌ట హ‌రికృష్ణ‌… చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.