భానుప్రియ కేసులో ట్విస్ట్.. సీన్ రివర్స్ అయింది .. మైనర్ బాలిక, ఆమె తల్లి అరెస్ట్

448

సీనియర్ హీరోయిన్ భానుప్రియ సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో భానుప్రియ వందలాది చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హోమ్లీ హీరోయిన్ పాత్రలలో ఆమె ఎక్కువగా నటించాడు. తాజాగా భానుప్రియ పై ఓ కంప్లైంట్ సంచ‌ల‌న‌మైంది. సామ‌ర్ల‌కోట వేదికగా బయట పడింది. ప్రభావతి అనే మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదు చేసింది.సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ ఏడాది క్రితం తన కుమార్తె సంధ్యని చెన్నైలో భానుప్రియ నివాసంలో పనికి పెట్టింది. ఆర్థిక పరిస్థితి బాగాలేక, చుట్టుపక్కల వాళ్ళ సలహాతో ఈ పని చేశానని ప్రభావతి తెలిపింది. తన కుమార్తెకు ప్రస్తుతం 14ఏళ్ల వయసు అని ఆమె వివరించింది.

Image result for భానుప్రియ కేసులో ట్విస్ట్

మొదట్లో తన కుమార్తెని తరచుగా ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారు. కానీ ఇప్పుడు తన కుమార్తెని వేధిస్తున్నారు అంటూ ప్రభావతి వాపోయింది. చైల్డ్ హెల్ప్ లైన్ వారికి ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగారు. వారి సాయంతో ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదు చేసింది. ఏడాది కాలంగా భానుప్రియ తన కుమార్తెని ఇంటికి పంపడం లేదని, వెట్టిచాకిరి చేయిస్తూ చిత్ర హింసలకు గురిచేస్తోందని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.భానుప్రియ సోదరుడు తన కుమర్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని సంచలన విషయాన్ని బయట పెట్టింది. అతడు తరచుగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడినా అంగీకరించడం లేదు. పైగా చోరీ కేసులు పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని భాదితురాలి తల్లి పేర్కొంది. ఇక ఈ ఆరోప‌ణ‌లు మీడియాలో రావ‌డంతో న‌టి భానుప్రియ అస‌లు జరిగింది ఏమిటి అనేది మీడియాకు వెల్ల‌డించారు.

Image result for భానుప్రియ కేసులో ట్విస్ట్

తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటి భానుప్రియ స్పందించారు. బాలిక తల్లి ప్రభావతి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో దొంగిలించిన వస్తువులను అడిగినందుకు తిరిగి తమపైనే కేసు పెట్టారని తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.ఏడాది నుంచి బాలిక తమ వద్ద పనిచేస్తోందని భానుప్రియ తెలిపారు. ఇంట్లో ఉన్న డబ్బు, ఇతర వస్తువులు కనిపించకపోవడంతో ఆమెను నిలదీశామని చెప్పారు. దొంగిలించిన నగదు, వస్తువులను బాలిక తన తల్లికి ఇచ్చేదని, పోలీసులకు చెబుతామని హెచ్చరించే సరికి బాలిక తన తప్పును అంగీకరించిందన్నారు. ఇదే విషయమై ఆమె తల్లిని ప్రశ్నించడంతో చెన్నై వచ్చి ఐప్యాడ్‌, వాచ్‌, కెమెరా ఇచ్చిందని తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మిగిలిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి సామర్లకోట వెళ్లి తనపై ఫిర్యాదు చేసిందని చెప్పారు.భానుప్రియపై తన తల్లి చేసిన ఫిర్యాదుపై బాలిక కూడా మీడియాతో మాట్లాడింది. భానుప్రియ ఇంట్లో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పింది. డబ్బు, నగలు దొంగిలించి తానే తన తల్లికి ఇచ్చానని వెల్లడించింది. వాటిని తిరిగి తీసుకొస్తానని చెప్పి వెళ్లిన తన తల్లి భానుప్రియపై కేసు పెట్టిందని చెప్పింది. తనకు ఎలాంటి వేధింపులూ లేవని బాలిక మీడియాకు వెల్లడించ‌డంతో ఈ విష‌యంలో పోలీసులు ఆ బాలిక తల్లి ప్ర‌భావ‌తిని విచారించ‌నున్నారు. మ‌రి ఇద్ద‌రిని విచారించి పోలీసులు వాస్తవాలు రెండు రోజుల్లో తెలియ‌చేస్తామ‌ని వెల్ల‌డించారు.