బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట‌ర్ అయిన టాప్ హీరోయిన్ ఆమె ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

693

బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జ‌ర‌గ‌చ్చు అంటూ, ఈ రియాల్టీ షో బుల్లితెర‌ను షేక్ చేస్తోంది.. నాని ఇచ్చే సీరియ‌స్ వార్నింగ్ లు కంటెస్టెంట్స్ మ‌ధ్య జ‌రిగే ఫ‌న్నీ ఇన్సిడెంట్ల‌తో వార్ మ‌రింత ర‌క్తిక‌ట్టిస్తోంది… ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేషన్ ద్వారా బ‌య‌టకు వెళ్లిన కంటెస్టెంట్స్ రాక ఇక షురూ అయింది.. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్ర‌గ్యా వ‌స్తుంది అని అన్నారు.. ఇక ఫైన‌ల్ గా హెబ్బా ప‌టేల్ వ‌స్తుంది అని సోష‌ల్ మీడియాలో, శాటిలైట్ మీడియాలో ఊద‌ర‌గొట్టారు.. కాని ఆమె ఏ హౌస్ కి వెళ్ల‌డం లేదు నేను నా హౌస్ లో ఉన్నాను అని క్లారిటీ ఇచ్చింది.

Image may contain: 1 person, smiling, close-up

అయితే ఈ రూమ‌ర్ల‌కు ఇక ఎండ్ కార్డ్ ప‌డింది…ఫైనల్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించే అవకాశం పూజా రామచంద్రన్ కు దక్కింది. అవును.. రాత్రి పూజా రామచంద్రన్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరైంది…నిజానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈమెకు దక్కాల్సింది కాదు. హెబ్బాపటేల్ పేరునే దాదాపు ఖరారు చేశారు. ఇక మేనేజ్ మెంట్ కూడా ఆమె రాక‌ను అక్క‌డ సిబ్బందికి తెలియ‌చేశారు.. చివ‌రి నిమిషంలో ఇలా ఆమె పేరుఖ‌రారు అయిన సీక్రెట్ మెసేజెస్, ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు లీక్ అవ‌డంతో, ఆమె రాక‌ను బిగ్ బాస్ నిర్వాహ‌కులు హూల్డ్ లో పెట్టారు.

Image may contain: 1 person, smiling, close-up

అలాగే హెబ్బా భారీగా పారితోషికం అడిగింద‌ట, ఇక చివ‌రకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు అనుకున్న అమౌంట్ కంటే కాస్త తక్కువకే పూజా రామచంద్రన్ ఒప్పుకోవడంతో ఆమె బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరైంది….తెలుగులో పూజా రామచంద్రన్ చాలా సినిమాల్లో నటించింది. కానీ నిఖిల్ తో చేసిన స్వామి రారా మాత్రమే ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది… లవ్ ఫెయిల్యూర్, దళం, బ్లాక్ కాఫీ, అడవి కాచిన వెన్నెల లాంటి సినిమాల్లో ఆమె నటించింది. కోలీవుడ్ లో కూడా చాలామంది ప్రేక్షకులకు ఆమె తెలుసు.

Image may contain: one or more people and cat

 

షో స్టార్టింగ్ నుంచి మరింత మసాలా అనే కాన్సెప్ట్ తో దూసుకుపోతున్న షో నిర్వహకులు.. ఇవాళ్టి నుంచి పూజా రామచంద్రన్ తో ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో చూడాలి. ఎంట‌ర్ అవ‌డమే ఎవ‌రికి దొర‌కకుండా అంద‌రూ నిద్రిస్తున్న స‌మ‌యంలో తెల్ల‌వారు జామున చిక్క‌కుండా తెలియ‌కుండా హౌస్ లోకి వెళ్లింది… ఆమెను మొద‌ట కౌశ‌ల్ చూశాడు ఇక మ‌రింత మ‌సాలా ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ఆమె ఎంట్రీని బిగ్ బాస్ ఎలా వాడ‌తారో చూడాలి. ఆమె ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండ‌బోతోంది అని అనుకుంటున్నారో మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.