సూర్య జ్యోతిక కాపురంలో నిప్పులు పోస్తున్న టాప్ హీరోయిన్.. షాక్ లో తమిళ ఇండస్ట్రీ

828

సూర్య జ్యోతిక….ఇండియన్ సినీ కపుల్స్ లలో మంచి జంట అనే పేరు తెచ్చుకున్నారు.ఇద్దరు సినిమా నటులే.స్టార్ స్టేటస్ ను అందుకున్న వాళ్లే.హీరో సూర్యకు సౌత్ ఇండియాలో అమ్మాయిల్లో చాలా క్రేజ్ ఉంది.ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు సూర్య గురించి అడుగుతుంటారు.అంతలా క్రేజ్ ఉంది.ఇక జ్యోతిక విషయానికి వస్తే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనుకునేంతలా అభిమానాన్ని సొంతం చేసుకుంది.అయితే అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సూర్యను పెళ్లి చేసుకుని ఫామిలీ లైఫ్ ను అనుభవిస్తుంది.భార్యాభర్తలు ఎలా ఉండాలంటే వీళ్ళిద్దరిని చూపిస్తే చాలు. అలాంటి వీళ్ళ సంసారంలో నిప్పులు పోయడానికి ఒక హీరోయిన్ రెడీ అయ్యింది.

Image result for surya family

ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు అనే తమిళ సినిమాతో పాటు బిగ్ బాస్ సీజన్ 2లో హాట్ హట్‌గా కనిపించిన యంగ్ హీరోయిన్ యషికా ఆనంద్ ప్రస్తుతం వివాదాన్ని కొనితెచ్చుకుంది. పాపులారిటీ కోసమో ఏమో తెలియదు కానీతమిళ స్టార్ హీరో సూర్యను తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఆమె చేసిన ప్రకటన పట్ల సూర్య భార్య, సినీ నటి జ్యోతిక అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఫ్యాన్స్‌తో ట్విట్టర్లో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ సూర్య ఫోటోను పోస్టు చేసి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో యాషిక వ్యాఖ్యలపై సూర్య ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. అంతేగాకుండా నటి జ్యోతిక ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సూర్యకు పెళ్లై ఇద్దరు పిల్లలున్న తరుణంలో యాషిక ఆయన్ని వివాహం చేసుకోవాలనుందని చెప్పడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

కుటుంబంతో హ్యాపీగా వున్న సూర్యను పెళ్లాడాలని ఎలా అంటుందని ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ల సంసారంలో నిప్పులు పోయ్యాలని చూస్తున్నదంటూ యషికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సూర్యకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలా యాషిక చేసిన కామెంట్స్ తమిళ సినీ ఇండస్ట్రీ సెలెబ్రిటీలను కూడా షాక్ కు గురిచేసింది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న సూర్య ఎందుకు పెళ్లి కానీ హీరోలు తమిళ్ లో చాలా మంది ఉన్నారు కదా. .వాళ్ళ మీద పోస్ట్ లు పెట్టొచ్చు కదా అని కొందరు ఫన్నీగా కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా యాషిక అటు బిగ్ బాస్ ద్వారానే కాకుండా ఇలా సూర్య మీద పెట్టిన పోస్ట్ వలన కూడా పాపులర్ అయ్యింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హీరోయిన్ యాషిక గురించి అలాగే ఆమె పెట్టిన పోస్ట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.