సిల్క్ స్మితతో అప్పట్లో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోలు వీళ్ళే

2730

సిల్క్ స్మిత అంటే వెండితెర ర‌థీదేవి అన‌టంలో సందేహం లేదు. కుర్రాడి నుంచి అర‌వైఏళ్ల ముస‌లాళ్ల దాక సినీమా హాల్ల‌కు ర‌ప్పించిన స‌క్సెస్ మంత్రా సిల్క్ స్మితా..! త‌న ఒక్క పాట‌తో సినిమాను మొత్తం సూప‌ర్‌డూప‌ర్ హిట్ చేసిన ట్రాక్ రికార్డ్ స్మిత‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఐట‌మ్ గ‌ల్‌కు అలాంటి ట్రాక్ రికార్డు లేదు. రిలీజ్ కాని సినిమాల్లో సిల్క్ ఐట‌మ్ సాంగు పెట్టి రిలీజ్ చేసి అధిక మొత్తాల‌ను కొల్లగొట్టిన నిర్మాత‌లు చాలామందే ఉన్నారు. అప్ప‌ట్లో సిల్క్ పాట‌లేని సినిమాలు ఊహించ‌లేము. సెప్టెంబ‌ర్ 23 1996 మ‌ద్రాల‌సులోని శాని గ్రామం అంతా ఆరోజు విషాద వ‌ద‌నం సిల్క్ స్మిత త‌న బెడ్ రూమ్‌లో ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది. ఆమె మ‌ర‌ణానికి సీనీ స్టార్లే కార‌ణ‌మా..! లేక బ్లూ ఫిలిమ్ మాఫియానే ఆమె ప్రాణం తీశాయా..అనేదే అంద‌రి అనుమానం. సిల్క్ స్మిత మ‌ర‌ణం ఎన్నో అనుమానాల‌కు కార‌ణ‌మైంది. ఎవ‌రైనా చంపేశారా లేక చ‌నిపోయో ప‌రిస్థితి క‌ల్పించారా. సిల్క్ జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for సిల్క్ స్మిత

సిల్క్ స్మిత అస‌లు పేరు విజ‌య ల‌క్ష్మి పుట్టింది ప‌శ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. విజ‌యల‌క్ష్మి తండ్రికి ఇద్ద‌రు భార్య‌లు. ఈమె మొద‌టి భార్య బిడ్డ. నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడే విజ‌య‌కు పెళ్లి చేశారు. స్మిత‌కు వెండి తెరవేల్పుగా ఉన్న సావిత్రి అంటే ఆమెకు ఎంతో అభిమానం. ఆ అభిమాన‌మే ఆమెలా సినిమా రంగాన్ని ఏలాల‌న్న ఆశ క‌లిగింది. ఇంకేముంది అనుకున్న‌దే త‌డువు ఇంట్లో చెప్పాపెట్ట‌కుండా మ‌ద్రాసులోని త‌న ఆంటీ ఇంటికి వ‌చ్చింది. మొద‌ట్లో అవ‌కాశాలు లేక సినీ ఫీల్డ్ లో చిన్నా చిత‌క ప‌నులు ఎన్నో చేసింది. త‌మిళ బి గ్రేడ్ న‌టుల‌కు మేక‌ప్ వేసింది.అయితే ఓ రోజు ఫ్లోర్ మిళ్లులో విజ‌య‌ల‌క్ష్మిని చూసి ఆమె అందానికి ఫిదా అయిన డైరెక్ట‌ర్ విను చక్ర‌వ‌ర్తి త‌నతో పాటు ఇంటికి తీసుకువెల్లాడు. సినిమాల్లో రానించ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల విద్య‌ల‌ను నేర్పించాడు. ఆత‌రువాత 1979లో ఇనాయో త‌డి అనే మ‌ళ‌యాల మూవి తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాయే ఆమె పేరును మార్చి వేసింది. విజ‌య‌ల‌క్ష్మి స్మిత‌గా మారింది. ఈ విజ‌యంతోనే స్మిత కాస్త సిల్క్ స్మితా అయ్యింది. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో స్మిత చేసిన సెక్స్ క్యారెక్ట‌ర్ ఆమె భ‌విష్య‌త్‌నే డిసైడ్ చేసింది. అప్ప‌టికే జ‌య‌ల‌క్ష్మి, జ్యోతి ల‌క్ష్మి ముదురు అందాలను చూసి మొఖం మొత్తిన అభిమానులు స్మిత లేత సొగ‌సులకు మ‌న‌స్సు పారేసుకున్నారు. దీంతో స్మిత‌కు ర్యాంపు క్యారెక్ట‌ర్లే వ‌చ్చాయి.1989లో వ‌చ్చిన మ‌ళ‌యాల మువీ ల‌య‌నం స్మిత‌కు ఎరోటిక్ ఇమేజ్ ను తెచ్చింది. ఆ సినిమాలో బికినీలో క‌నిపించి అప్ప‌టి కుర్రాల‌కు ఎన్నో నిద్ర‌లేని రాత్రుల్ని చేసింది.

Image result for సిల్క్ స్మిత

సీతాకోక చిలుక‌తో సిల్క్ స్మిత టాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు సినిమా ఐట‌మ్ సాంగ్స్ కు ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిల‌చిన బావ‌లు స‌య్యా అనే పాట సిల్క్ కేరీర్ లోనే బిగ్ ఆఫ్‌ హిట్‌. ఎన్టిఆర్‌, కృష్ణ, శోభన్ బాబు , చిరంజీవి, బాల‌కృష్ణా, నాగార్జున‌ల‌ ర‌జ‌నీకాంత్, కమల్ హాసన్, స‌త్య‌రాజుల‌తో సినిమాల‌లో సిల్క్ ఆడ‌పాడింది. వారిలో కొంద‌రితో సిల్క్ కు రియ‌ల్ లైఫ్ అఫైర్స్ ఉన్న‌ట్లు గాసిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో స్మిత అఫైర్ ఆరోజుల్లోనే కోలీవుడ్ కోడైకూసింది. ఇక టాలివుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణాతోను సిల్క్ కు అవినాభావ సంబందం ఉంద‌ని ప్ర‌చారం ఉంది. రియ‌ల్ హీరో ఖైధి రుద్ర‌య్య సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేసిన సిల్క్ కు కృష్ణ ఫిదా అయిన‌ట్లు చెప్పుకుంటారు. క‌న్న‌డ‌ సూప‌ర్ స్టార్ స‌త్య‌రాజ్ కూడా స్మిత కోసం ట్రై చేసిన‌ట్లు టాక్‌.ఓ డాక్ట‌ర్ ఎంట్రీతో సిల్క్ స్మితా జీవితం అనూహ్య మ‌లుపులు తిరిగింది. ఆయ‌న ఎవ‌రో ఎలా ఉంటారో ఎవ‌రికీ తెలియ‌దు. కాని సిల్క్ కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే ఆ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌య్యాడు. ఆమె ఒంటరి పోరుకు ఆ డాక్ట‌ర్ తోడు కొండంత అండ‌గా అనిపించింది. ఇద్ద‌రు క‌ల‌సి స‌హ‌జీవ‌నం చేశారు. ఇద్ద‌రికి పెళ్లైంద‌ని కూడా చెబుతారు. అత‌ని స‌ల‌హాతోనో, బ‌ల‌వంతాగోనో రెండు సినిమాలు తీసింది. కాని అవి అట్ట‌ర్‌ఫ్లాప్ కావ‌టంతో ఒక్క‌సారిగా అప్పుల ఊభిలో కూరుకు పోయింది. సిల్క్ తో సినిమాలు తీసి కాసులు సంపాదించుకున్న ఏ ఒక్క‌రు క‌ష్ట‌కాలంలో ఆమెను ఆదుకోలేదు. అందరు త‌ప్పించుకునే తిరిగారు. దీంతో జ‌గ‌మంతా కుటుంబంలో ఒంట‌రిన‌న్న భావ‌న స్మిత‌ను చుట్టుముట్టింది.

Image result for సిల్క్ స్మిత

అయితే ఆర్థిక ఇబ్బందులు సిల్క్ కు కొత్త కాదు. పేద‌రికంలో పుట్టిన స్మిత రెండు సినిమాలు తీసి న‌ష్ట‌పోయినంత మాత్రాన ఆత్మ‌హ‌త్య చేసుకుంటుందా! ఆత్మహ‌త్య చేసుకన్న గ‌దిలో ల‌భించిన సూసైడ్ నోట్‌లో ఇలా ఉంది..ఆశ‌ల‌న్ని ఒక‌రి మీద పెట్టుకున్నాను అత‌ను మోసం చేశాడు. చుట్టు ఉన్న‌వాళ్లే మ‌నశాంతి లేకుండా చేశారు. ఇంత సాదించిన మ‌న‌శాంతి లేదు అని ఉంది. ఈ మాట‌లు స్మిత మ‌ర‌ణం వెనుక చీక‌టీ కోనం ఉంద‌న్న నిజాన్ని బ‌య‌ట పెట్టాయి. సినిమాలు తీసి న‌ష్ట‌పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సిల్క్ ను బ్లూ ఫిల్మ్ మాఫియా అప్రోచ్ అయ్యింది. త‌మ సినిమాల్లో నటిస్తే కోరినంత డ‌బ్బు ఇస్తామ‌ని ఆశ పెట్టింది. ఒప్పుకోవాల‌ని స్మిత‌పై ఒత్తిడి తెచ్చింది. ఇందుకు త‌న‌తో స‌హ‌జీవ‌నం చేసిన డాక్ట‌ర్ కూడా వంత పాడ‌టంతో దీనికి సిల్క్ ఒప్పుకోక పోవ‌డంతో నీలి చిత్రాల‌లో న‌టిస్టుంద‌ని ప్ర‌చారం చేశారు. ఆ పుకార్ల అవ‌మాన భారాన్ని సిల్క్ త‌ట్టుకోలేక పోయింది. దీంతోపాటు నా అనుకున్న వాడే ఆ ప‌ని చేయ‌మ‌ని బ‌ల‌వంతం పెట్ట‌డాన్ని జీర్ణించుకోలేక పోయిది. ఇక బ‌త‌క‌డం వేస్ట‌ని ఊపిరి తీసుకుంది.

ఈ కార‌ణంతోనే సిల్క్ స్మితా జీవితం ఎండ్ అయ్యింద‌ని న‌మ్మేవాళ్లు చాలామందే ఉన్నారు. అస‌లు సిల్క్ మ‌ర‌ణం సూసైడ్ కాద‌న్న అనుమానం ఫ‌స్ట్ పోలీసుల‌కే వ‌చ్చింది. త‌న బెడ్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చ‌నిపోయిన‌ట్లు ఉన్న సిల్క్ చావును ఖాకీలు అనుమానించారు. అనుమానం ఎందుకు వ‌చ్చిందో కాని ఆ యాంగిల్‌లో కేసును ధ‌ర్య‌ప్తు చేయ‌లేదు. పోస్టు మార్టం రిపోర్టులో పాయిస‌న్‌ లేద‌ని తేలాక కేసును పోలీసులు సింపుల్‌గా సూసైడ్ అని క్లోజ్ చేశారు. చివ‌రి రోజుల‌లో సిల్క్ తో స‌హ‌జీవ‌నం చేసిన ఆడాక్ట‌ర్ ను ఎందుకు విచారించ‌లేదు. మ‌రోవైపు పోస్టుమార్టం రిపోర్టులో స్మిత క‌డుపులో అర‌టిపండ్లు, చాక్లెట్లుత‌ప్ప ఆహార‌మేలేద‌ని తేల్చారు. చాలా రోజుల ముందు నుంచే ఆహారం తీసుకున్న‌ధాఖ‌లాలు లేవని గుర్తించారు. అలాంటి ప‌రిస్థితి ఆమెకు ఎందుకు వ‌చ్చింది. ఇవ‌న్నీ సిల్క్ మ‌ర‌ణంలో మిస్టరీగా మిగిలిపోయాయి.అసలు ఏం జరిగిందో ఒక్క సిల్క్ కు మాత్రమే తెలియాలి.ఆమె ఏ లోకాన ఉన్న సంతోషంగా ఉండాలని కోరుకుందాం.మరి సిల్క్ స్మిత గురించి అలాగే ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి చక్కునిపోయిన విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.