శ‌ర్వా ఇంటిముందు ఆరుగురు డైరెక్ట‌ర్లు

534

యంగ్ హీరో శ‌ర్వానంద్ ఫ్యామిలీ ల‌వ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి… ఇక అందుకే ఇలాంటి క‌థ‌లు వ‌స్తే ముందు శ‌ర్వాని సంప్ర‌దిస్తారు ద‌ర్శకులు.. ఇక తాజాగా శ‌ర్వానంద్ ఇంటి ముందు డైరెక్ట‌ర్లు క్యూ క‌డుతున్నారు అని తెలుస్తోంది.. శ‌ర్వాకు ఆరుగురు ద‌ర్శకులు క‌థ చెబితే కేవ‌లం ఒక్క క‌థ‌మాత్ర‌మే ఆయ‌న ఒకే చేశారు అని తెలుస్తోంది.

Image result for sarvanand

ఇప్ప‌టికే శ‌ర్వానంద్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో పడి పడి లేచె మనసు, సుధీర్ వర్మ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా ద‌ర్శ‌కులు శ్రీకాంత్ అడ్డాల, శ్రీనివాస రాజు , వీరిద్దరే కాకుండా మరో ఇద్దరు డైరెక్టర్ శ‌ర్వాను క‌లిసి క‌థ చెప్పార‌ట‌… ఇక వారి క‌థ‌ల‌పై ఎటువంటి స‌మాధానం చెప్ప‌లేద‌ట శ‌ర్వానంద్.

Related image

అలాగే భారీ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌నున్నాడు.. శ‌ర్వానంద్.. ఇందులో శ‌ర్వాతో పాటు నితిన్ కూడా న‌టించ‌నున్నారు… ఇక కొత్త ప్రాజెక్టులు ఒకే చేయ‌కుండా ఒప్పుకున్న సినిమాలుమాత్ర‌మే చేసి వాటిని ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాడు శ‌ర్వా, అలాగే కొత్త డైరెక్ష‌న్లో సినిమాకు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయిన త‌ర్వాత ఆ సినిమాని సెట్స్ పై పెట్టాలి అని శ‌ర్వా ఆలోచ‌న‌గా తెలుస్తోంది.