హీరో రాజశేఖర్ కి షూటింగ్ లో భారీ ప్రమాదం హాస్పిటల్ కి తరలింపు

1421

హీరో రాజశేఖ‌ర్ పేరు చెబితే బ్యూటిఫుల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనే చెప్పాలి…రాజ‌శేఖ‌ర్ అనేకంటే జీవిత రాజ‌శేఖ‌ర్ అంటేనే ఆ పేరు వెంట‌నే గుర్తు వ‌స్తుంది.. ఆయ‌న చేసిన ఏ సినిమా అయినా కుటుంబ క‌థా చిత్రాలుగా ఉంటాయి.. అయితే రాజ‌శేఖ‌ర్ సినిమాలకు మ‌హిళా అభిమానులు ఎక్కువ‌గా ఉండేవారు .. ఇటీవ‌ల సినిమాలు కాస్త త‌గ్గించినా సెల‌క్టెడ్ సినిమాలు మాత్ర‌మే చేస్తున్నారు.. గ‌రుడ‌వేగ సినిమా ఆయ‌న‌కు ఇటీవ‌ల సూప‌ర్ స‌క్సెస్ ఇచ్చింది. ఇక సినిమాల విష‌యంలో త‌న‌కు తానుగా కొన్ని క‌థ‌లు సెల‌క్ట్ చేసుకోవ‌డంలో రాజ‌శేఖ‌ర్ స్టైలే వేరు ఆయ‌న సినిమాల‌కు న‌ట‌న‌కు అభిమానులు చాలా మంది ఉన్నారు.

Image result for hero rajasekhar

అయితే కొన్ని రియ‌ల్ సీన్లు చేయ‌డంలో కూడా ఆయ‌నకు సాటేలేరు..ఇది ఆయ‌న‌కు ముందు నుంచి ఉన్న అలవాటుగా చెబుతారు.. తాజాగా ఆయ‌న‌కు షూటింగ్ లో ప్ర‌మాదం జ‌రిగింది అనే వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఆ విష‌యాలు ఏమిటో తెలుసుకుందాం.అవును గ‌న్ మిస్ ఫైర్ అవ‌డంతో హీరో రాజ‌శేఖ‌ర్ కి గాయాల‌య్యాయ‌ట‌. కానీ అది షూటింగ్ లో వాడే డ‌మ్మీ గ‌న్ కావ‌డంతో పెద్ద‌గా గాయాలేమీ కాలేదు. చిన్న గాయాలే కావ‌డంతో ట్రీట్ మెంట్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటే స‌రిపోతుంద‌ని చెప్పార‌ట డాక్ట‌ర్స్. ఇంత కీ ఎప్పుడు ఎక్క‌డ ఎలా జ‌రిగింద‌నే క‌దా మీ డౌటు …ఒక‌సారి పూర్తి వివ‌రాల్లోకి వెళితే…. రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లో ఈ ఇన్సిడెంట్ జ‌రిగింది. గ‌న్ తో షూట్ చేసే సీన్ ఒక‌టి సినిమాలో ఉంద‌ట‌.

Image result for hero rajasekhar

విల‌న్ గ్యాంగ్ పై హీరో రాజ‌శేఖ‌ర్ షూట్ చేసే సీన్ అల‌. ఈ సీన్ చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు గ‌న్ మిస్ ఫైర్ అయింద‌ట‌. రియ‌ల్ గ‌న్ , బుల్లెట్స్ తో షూటింగ్ చేయ‌రు కాబ‌ట్టి డ‌మ్మీ బుల్లెట్ భుజానికి త‌గిలింద‌ట‌. దీంతో సెట్ లో అంతా టెన్ష‌న్ పడ్డార‌ట‌. వెంట‌నే రాజ‌శేఖ‌ర్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్ట‌ర్ ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని చెప్ప‌డంతో షూటింగ్ క్యాన్సిల్ చేయ‌డం ఇష్టం లేని రాజ‌శేఖ‌ర్ లొకేష‌న్ కి వెళ్లి త‌న సిన్సియారిటీని చాటుకున్నారు. మ‌రి చూశారుగా ఆయ‌న వ‌ర్క్ డెడికేష‌న్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.