శ్రీయ కి రామ్ కి ఉన్న సంబంధం ఏంటి…..

1113

సినీ ప్రపంచంలో చాలామంది స్నేహితులుగా ఉంటారు..కొందరు కెరీర్ లో ఉన్నంత వరకే స్నేహితులుగా ఉంటే మరికొందరు మత్రం కెరీర్ ను కాపాడి మరీ స్నేహితులుగా ఉంటారు..ఆ స్నేహాల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు..నిజానికి శ్రియకు సినిమా నేపధ్యం లేదు..దెహ్రాడూన్ లో 1982 సెప్టేంబర్ 11 న పుట్టిన శ్రియ అసలు పేరు శ్రియ శరణ్ భట్నాగర్..డిల్లీ లోని ఒక మహిళా కాలేజ్ లో చదువుతున్నప్పుడు తన లెక్చరర్ బ్రతిమాలితే ఒక మ్యూజిక్ ఆల్బం లో ఆమె యాక్ట్ చేసింది..ఆ వీడియో రామోజీ బృందం కళ్ళలో పడడం వెనువెంటనే సినిమా అవకాశాలు తలుపు తట్టడం జరిగాయి..రామోజీ బృందం పిలుపు మేరకు శ్రియా శరణ్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది..మీడియా సినిమాలు సినిమా రంగం బాగా కొత్తయిన శ్రియ ఇష్టం సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది..ఆ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నువ్వే నువ్వే సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం స్రవంతి రవికిషోర్ వెతుకుతున్నారు..ఇష్టం సినిమా సెట్స్ లో శ్రియను చూసిన రవి కిషోర్ ఆమె అయితే తన సినిమాకు సరిగా సరిపోతుంది అని భావించి తమ సినిమాలోకి తీసుకున్నారు..

Image result for shriya

అలా శ్రియ గురించి తెలుగు ఇండస్ట్రీకి తెలిసే సరికి తన తొలి చిత్రం ఇష్టం సినిమా రిలీజ్ కు ముందే మూడు సినిమాలకు శ్రియ సంతకం చేసింది..ఆ సినిమాలు..నువ్వే నువ్వే..చెన్నకేశవరెడ్డి..సంతోషం..అప్పుడు ఆమేకు డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం..సినిమా సినిమాకు సమన్వయం చేసుకోవడం..అసలు తెలీదు..దీంతో అయోమయంలో పడిన శ్రియకు స్రవంతి రవికిషోర్ గారే సాయం చేసారు..ఇండస్ట్రీలో పెద్దవారు కావడంతో ఆయన అనుభవాలు శ్రియకు బాగా ఉపయోగపడ్డాయి..శ్రియ సినీ జీవితం బిల్డప్ చేయడానికి తన వంతు సాయం చేసారు..అలా రామ్ పెదనాన్న చలవతో 2002 లో టాలివుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగింది శ్రియ..ఆ తరువాత 2008 వరకూ కూడా శ్రియకు సంబందించిన డేట్స్ సినిమాలు కధల ఎంపికలో సాయమంతా రవికిషోర్ గారే చూసుకునేవారట.. ఇప్పుడు తమ్ముడు కుమారుడు రామ్ కు రవికిషోర్ ఎలాంటి భరోసా ఇస్తున్నారో అప్పుడు శ్రియకు అలాగే హెల్ప్ చేసారట..ఆ కృతఙత తో రవికిషోర్ అడిగిందే తడవుగా టాప్ హీరోయిన్ గా వెలుగుతున్నా కూడా రామ్ సినిమాలో శ్రియ ఐటం సాంగ్ చేసింది..

ఈ క్రింద వీడియోని చూడండి

రాం కుటుంబం చలువ వల్లే తాను సినీ రంగంలో అగ్ర స్థానం చేరుకున్నట్లు చెప్పిన శ్రియ శరణ్ ఐటం సాంగ్ చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదని తేల్చి చెప్పింది..రామ్ ఆయన సోదరితో సహా ఆయన కుటుంబంలోని అందరితో శ్రియకు మంచి పరిచయం ఉందట..తరచూ రామ్ ఇంటికి వెళ్ళడం శ్రియకు అలవాటే..ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయిన శ్రియను రామ్ కుటుంబం కూడా బాగా చూసుకునేదట..తెలుగులో అగ్ర హీరోలందరితో నటించిన శ్రియ దక్షిణాదిలోని ఇతర బాషల్లోనూ హిందీలోనూ నటించింది..కొన్ని ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది ఈ సుందరి..శ్రియ కోసం మంచి అనుభవం ఉన్న మేనేజర్ ను రవికిషోర్ గారే నియమించారట..ఆ తరువాత ఆయన పూర్తిగా రామ్ విషయాలనే చూసుకుంటున్నారు..ఇప్పుడు అడపాదడపా ఒకట్రెండు సినిమాల్లో కనిపిస్తున్న శ్రియ ఒక రష్యన్ కుర్రాడిని ప్రేమించి పెళ్ళి చేసుకొని హాయిగా సెటిల్ అయిపోయింది..2018 మర్చి 12 న రష్యాకు చెందిన వ్యక్తిని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివహం చేసుకుంది..మూడు రోజుల పాటు వారి వివాహం సన్నిహితులు బందుమిత్రులు మధ్య ఘనంగా జరిగిందట..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..