నూతన్ నాయుడు ఎలిమినేషన్ వెనుక అసలు నిజం బయటపడింది

438

ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న బిగ్ బాస్ టెలివిజ‌న్ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.బిగ్ బాస్ సీజన్ 2 అంతిమ ఘట్టానికి చేరుకుంది. 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాలిటీలో 85వ ఎపిసోడ్ నాటికి కేవలం 8 మంది మంది మాత్రమే మిగిలారు. ఇక 15 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో బిగ్ బాస్ రంజుగా యమ రంజుగా మారింది. ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ ఎలిమినేషన్ స్టార్, సామాన్యుడు గణేష్ గత ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన గణేష్ 85 రోజుల బిగ్ బాస్ జర్నీ ఎలా ఉందో ప్రేక్షకులతో పంచుకున్నారు.గ్ బాస్ హౌస్‌లో ఇక్కడి వరకూ రావడానికి ప్రేక్షకులే కారణం. వాళ్లే నా దేవుళ్లు. వాళ్లు లేకపోతే నేను లేను. ఇక్కడకి రాక ముందు నేను ఏంటో నాకే తెలియదు. ఇక్కడకు వచ్చాక లైఫ్ అంటే ఏంటో తెలిసింది. బిగ్ బాస్ నాకు లైఫ్ నేర్పింది.

Related image

నేను ఇక్కడికి కారణమైన అమ్మ, నాన్న, అన్నయ్య, బిగ్ బాస్ టీం, నా మంచి కోరుకునే నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెప్పాడు.ఇక హౌస్‌లో ఉన్న గీతా మాధురి, దీప్తి నల్లమోతు అక్కలంటే నాకు చాలా ఇష్టం. గీత అక్క నాకు చాలా సపోర్ట్ చేశారు. లైఫ్‌లో ఎప్పటికీ ఆమెను మర్చిపోలేను అని అన్నారు. ఇక దీప్తి గురించి మాట్లాడుతూ.. అక్కా!! నాకు ప్రామిస్ చేశావు. ఏడ్వను అని నువ్ ఏడవద్దు గేమ్ తొలి నుండి ఎంత కాన్ఫిడెంట్‌గా ఆడుతున్నావో అలానే ఆడు అక్కా అంటూ సలహా ఇచ్చాడు గణేష్.ఇక ఆనవాయితీ ప్రకారం బిగ్ బాస్‌ హౌస్‌ని వీడేవాళ్లకు బిగ్ బాంబ్ అస్త్రం ఉండటంతో.. ఈ వారం బిగ్ బాంబ్‌లో భాగంగా వారం అంతా కిందే పడుకోవాలని ఈ బిగ్ బాంబ్ ఎవరిపై విసరబోతున్నావ్ అని నాని అడగ్గా.. రెండో ఆలోచన లేకుండా కౌశల్ పేరు చెప్పారు గణేష్.

Image result for big boss 2 telugu vote

ఇక బిగ్ బాంబ్ విసురుతూ.. ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉందో వాళ్ల మీదే బిగ్ బాంబ్ వేస్తారు అని పంచ్ వేశాడు గణేష్. దీనికి కౌంటర్‌గా కౌశల్.. నీ ప్రేమ ఏంటో నాకు అర్ధమైంది అన్నారు.ఇక వారం అంతా హీట్ హీట్‌గా సాగిన బిగ్ బాస్ హౌస్ ఆదివారం నాడు నాని ఎంట్రీతో సరదా సరదా సాగుతోంది. ఫన్నీ ఫన్నీ టాస్క్‌‌లతో ఫుల్ ఎంటర్ టైన్‌ చేశారు. మొదటి కౌశల్ కళ్లకు గంతలు కట్టుకుని రోల్ రైడాను జడతో అలంకరించాడు. అనంతరం సామ్రాట్ కళ్లకు గంతలు కట్టిన గీతా మాధురి సాస్‌లను తినిపించగా.. తరువాత గీతా మాధురికి అదే సాస్‌లను తినిపించాడు సామ్రాట్. ఈ టాస్క్ మొత్తం ఫన్నీగా సాగింది. నూతన్ నాయుడు ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. వాస్తవానికి మూడో వారంలోనే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత భుజం గాయం కారణంగా మరోసారి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి.. ఈ తరువాత మూడో సారి ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ హౌస్‌కి మూడు సార్లు జర్నీ చేశారు నూతన్ నాయుడు.

Image result for big boss 2 telugu vote

అయితే ఈసారి ఓటింగ్‌ ద్వారా మరోసారి ఎలిమినేట్ అయ్యారు నూతన్ నాయుడు. ఇక 15 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో నూతన్ నాయుడు మరో ఎంట్రీ లేనట్లే. ఇక ఆయన ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో కామన్ మేన్ కోటా ఖాళీ అయ్యింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో మిగిలిన సామ్రాట్, అమిత్‌లు సేఫ్ జోన్‌కి వెళ్లారు.ఇక బిగ్ బాంబ్‌లో భాగంగా ఈవారం అంతా హౌస్‌లో అందరి ప్లేట్లు కడగాలని.. ఈ బిగ్ బాంబ్ ఎవరిపై విసురుతున్నారని నాని అడగటంతో… హౌస్‌లో నాకు ఉన్నది ఇద్దరే స్నేహితులు ఒకరు కౌశల్, ఇంకొకరు దీప్తి అన్నారు. అయితే కౌశల్‌పై బిగ్ బాంబ్ వేయలేనంటూ దీప్తిపై బిగ్ బాంబ్ విసిరారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ముందుగానే బిగ్ బాస్ హౌస్ లో నూత‌న నాయుడు ఎలిమినేష‌న్ ఉంటుంది అని భావించారు అలాగే నూత‌న నాయుడు ఎలిమినేట్ అయ్యారు ఈ వారం టాస్క్ ల్లో స‌రిగ్గా పార్టిసిపేట్ చేయ‌క‌పోవ‌డం, ఇలాంటివి ఆడియన్స్ కు పెద్ద న‌చ్చ‌లేదు. దీంతో నూత‌న్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.. అయితే ఆదివారం ఉద‌యం నుంచే బిగ్ బాస్ ట్రోల్స్ లో నూత‌న్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ‌తారు అంటూ వైర‌ల్ అయ్యాయి.. చివ‌రకు ఆయ‌న ఎలిమినేట్ అయ్యారు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.