జగన్ కి ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఏమి అన్నాడో తెలిస్తే షాక్ అవుతారు

428

జూనియర్ ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుకు దగ్గర బంధువు, జూనియర్ ఎన్టీఆర్ కు స్వయానా మామ అయిన నార్నె వైసీపీలో చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో చేరడం వెనుక కుటుంబరమైన విరోధాలు కారణం కాదని అన్నారు. ఫామిలీ విషయాలు రాజకీయాల్లోకి లాగడం కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. వైసీపీలో చేరడం తన వ్యక్తిగతం అన్నారు. వైఎస్సార్ హయం నుండి ఆయనకు మద్దతుగానే ఉన్నానని తెలిపారు. జగన్ సీఎం అవాలని కాంక్షిస్తున్నానని, చంద్రబాబు పరిపాలన నచ్చకే వైసీపీలో చేరుతున్నానని స్పష్టం చేసారు. టికెట్ ఆశించి రాలేదని, తాను ఎన్నికల బరిలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కృషి చేస్తానని తెలిపారు.

Image result for నార్నె శ్రీనివాసరావు

అయితే దీని వెనుక జగన్ స్ట్రాటజీ ఉందంటున్నారు కొందరు నేతలు. ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని, ఆయన కుటుంబానికి అన్యాయం చేసి టీడీపీ పగ్గాలు పట్టుకున్నారని లక్ష్మిపార్వతితో పాటు విపక్షాలు, కొందరు సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం. తన కొడుకు తారక్ ను టీడీపీలో ప్రముఖ స్థాయిలో చూడాలనుకున్న హరికృష్ణ కలను చంద్రబాబు హరించేశారని మరికొందరి అభిప్రాయం.అందుకే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని పార్టీ నుండి బయటకు వచ్చారని ప్రధానంగా వినిపించే మాట. కొడాలి నాని టీడీపీ నుండి బయటకు రావడం వెనుక జూనియర్ హ్యాండ్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటిని ఖండించారు తారక్. “చివరి శ్వాస ఉన్నంతవరకు మా తాతగారు స్థాపించిన టీడీపీ వైపే ఉంటాను. పార్టీకి న అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండ వస్తాను. ప్రస్తుతం నా ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నాను. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నాను” అని కరాఖండిగా తేల్చి చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో కూకట్ పల్లి అభ్యర్థిగా నిలబడిన సొంత అక్క సుహాసిని కోసం కూడా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. ప్రస్తుతం నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తానో లేదో తెలియదు, జగన్ గెలుపు కోసం ప్రచారం చేస్తా అనడంతో ఆయన రాష్ట్రంలో వైసీపీ తరపున ప్రచారం చేసే బాధ్యతలే చేపట్టబోతున్నారని చూచాయిగా తెలుస్తోంది.అయితే వైసీపీలో చేరిన వెంట‌నే నార్మెకు జ‌గ‌న్ కీల‌క బాధ్య‌త‌లు ఇచ్చారు ,ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ కు తార‌క్ ఫోన్ చేసి తాను మాత్రం వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేయ‌న‌ని , త‌న తాత పార్టీకే నా ప్ర‌చారం స‌పోర్ట్ ఉంటుంది అని, త‌న మామా ఆయ‌న ఇష్ట‌ప్ర‌కారం వైసీపీలో చేరారు అని తెలియ‌చేశారు తార‌క్.. దీంతో జ‌గ‌న్ కూడా ఎటువంటి కోర‌క కోర‌లేద‌ట మ‌రి ఇక ఎన్నిక‌ల‌కు నెల రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. మ‌రి తారక్ ఈసారి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తారా లేదా అనేది చూడాలి.