మహేష్ అన్న..నాన్న జాగ్రత్త… ఫోన్ చేసిన తారక్ తో ఏడ్చేసిన మహేష్ బాబు

234

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఆ కుటుంబాన్ని పలువురు ఓదార్చుతున్నారు. అయితే RRR షూటింగ్ ఉండడంతో ఎన్టీఆర్ రాలేకపోయాడు. అందుకే ఫోన్ చేసి పరామర్శించాడు. ముందు నరేష్ కు ఫోన్ చేసిన ఎన్టీఆర్ ఓదార్చాడు. ఇలాంటి సమయంలోనే దైర్యంగా ఉండాలని నరేష్ ను ఓదార్చాడు. అలాగే మహేష్ బాబుకు కూడా ఎన్టీఆర్ కాల్ చేసి మాట్లాడాడు. విజయనిర్మల గారి మరణం తనను ఎంతో కలచివేసిందని చెప్పాడు. ఇక కృష్ణ గారి గురించి అడిగి తెలుసుకున్నాడు. నాన్న గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆయన పక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూ ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉండిఉంటాడో ఉహించుకోగలను కాబట్టి ఆయనను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పాడు. ఇలా ఎన్టీఆర్ కృష్ణ గురించి మాట్లాడేసరికి మహేష్ కంటతడి పెట్టుకున్నాడంట.

Image result for vijaya nirmala

ఇక రోజు ఆమె అంత్యక్రియలు చిలుకూరులోని విజయ్ కృష్ణ గార్డెన్స్‌లో శుక్రవారం జరుగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లకుండా చిలుకూరులో ఉన్న విజయకృష్ణ గార్డెన్స్‌కు పూలరథంలో అమ్మను తీసుకెళతామని నరేష్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అంతిమ యాత్ర మొదలవ్వాల్సి ఉండగా…. చిలుకూరులో కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం కాస్త ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. విజయ నిర్మల అంతిమ యాత్రలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అశృనయనాల మధ్య పూల రథంలో విజయ నిర్మల పార్థివ దేహాన్ని చిలుకూరు తరలిస్తున్నారు.పలువురు ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. మరి విజయ నిర్మలకు మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం. అలాగే ఎన్టీఆర్ మహేష్ కు ఫోన్ చేసి మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.