జూ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి కుమిలి కుమిలి ఏడ్చిన బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ

458

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మన అందరికి తెలిసిందే.హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.పలువురు సినీ ప్రముఖులు రాజకీయనాయకులు,కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.అయితే అంత్యక్రియలకు ఎందరో వచ్చారు కానీ సొంత తమ్ముడి కొడుకు మోక్షజ్ఞ రాలేదు.అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎన్టీఆర్ కు ఫోన్ చేశాడనే ఒక వార్త బయటకు వచ్చింది.మరి ఎన్టీఆర్ కు ఫోన్ చేసిన మోక్షజ్ఞ ఏం మాట్లాడాడో తెలుసుకుందామా.

Image result for మోక్షజ్ఞ

హరికృష్ణను చూడటానికి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు రక్త సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏ సంబంధం లేని వారి వరకు అందరు వచ్చారు.హరికృష్ణతో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అన్నయ్య మృతదేహాన్ని చూడటానికి బాలకృష్ణ వచ్చాడు.దగ్గరుండి అన్ని చూసుకున్నాడు.అన్న మృతదేహాన్ని చూసి కంటతడి కూడా పెట్టాడు.దగ్గర ఉండి మరీ అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడు.ఒక్క బాలకృష్ణనే కాదు ఆయన భార్య కూతుర్లు కూడా వచ్చారు.అయితే మోక్షజ్ఞ మాత్రం రాలేకపోయాడు.దీని గురించి మీడియాలో రకరకాల కథనాలు కూడా వెలువడ్డాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది.అదేమిటి అంటే ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు మోక్షజ్ఞ ఫోన్ చేశాడంట.

Image result for ntr

అన్నయ్య పెదనాన్న చనిపోయినందుకు మీరు ఎంత బాధలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను.ఆ సమయంలో మిమ్మల్ని నేను అలా చూడలేను.అలాగే ఆ సమయంలో ఫోన్ చేసి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు.అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను.ఇప్పుడు ఫ్యామిలీలో అందరికి మీరే దైర్యం చెప్పాలి.దైర్యంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చాడంట.తన తమ్ముడి నుంచి ఫోన్ రావడంతో మోక్షజ్ఞ యోగక్షేమాలను కూడా ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నాడంట.ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.సినిమాలో తన పార్ట్ షూటింగ్ కూడా దగ్గర పడుతుండడంతో మోక్షజ్ఞ తన పెదనాన్నను చివరి చూపు చూసుకోలేకపోయాడంట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇదే విషయాన్నీ తారక్ కు చెప్పగా తారక్ నేను అర్థం చేసుకోగలను.నువ్వేమి బాధపడకు.కెరీర్ మీద దృష్టి పెట్టి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పాడంట.దీనికి మోక్షజ్ఞ ఎంతో సంతోషించాడంట. ఈ అన్నదమ్ములు అందరు కలిసి ఎప్పుడు దర్శనమిస్తారో అని అభిమానులందరూ ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు.త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. హరికృష్ణ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన మోక్షజ్ఞ గురించి అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.