చనిపోయే ముందు చివరి సారిగా నాగార్జున కు ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా?

504

సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం.

Image result for harikrishna nandamuri car accident images

ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.అయితే హరికృష్ణ మరణం గురించి విన్న వెంటనే నాగార్జున దిగ్బంతి చెందాడు.హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని చెప్తూ నాగార్జున ఒక ట్వీట్ చేశాడు.దాని గురించి తెలుసుకుందామా.హరికృష్ణ హఠాన్మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. హరికృష్ణ మృతి పట్ల నటుడు అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘చాలా రోజులైంది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు’ అని తనతో చివరిసారిగా హరికృష్ణ తనతో ఫోన్‌లో మాట్లాడారని నాగార్జున కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.ఖచ్చితంగా కలుద్దాం అన్న అని నేను అన్నాను.ఎప్పుడు కలుస్తావు అని అడిగారు.తొందర్లోనే కలుద్దాం అని నేను చెప్పాను.

Image result for harikrishna nandamuri car accident images

ఎందుకు అన్న ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటరా అని అడిగితే ఏం లేదు..కొంచెం లోన్లీగా ఉంది.నిన్ను కలిసి ప్రశాంతంగా మాట్లాడాలని ఉంది అని అన్నారు.ఆ మాటకు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.ప్రస్తుతం దేవదాస్ షూటింగ్ లో ఉన్న ఇప్పుడు షూటింగ్ ను క్యాన్సిల్ చేస్తే చాలా నష్టం జరుగుతుంది.కాబట్టి షూటింగ్ ఒక వారంలో కంప్లీట్ అవుతుంది.అప్పుడు వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తా..ఒకరోజంతా మీతో గడుపుతా అని చెప్పినట్టు నాగార్జున చెప్పాడు.‘కొద్ది వారాల కిందట ఫోన్ చేసి చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు అన్నారు… ప్రస్తుతం మనల్ని వదిలివెళ్లిపోయారు. అన్న మరణవార్తను తెలుసుకున్న తరువాత, తాను ఒంటరిని అయిపోయినట్టు అనిపిస్తోంది.. ఐ మిస్ యూ అన్నా’ అంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.

సీతారామరాజు సినిమాలో హరికృష్ణ, నాగార్జున సోదరులుగా నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది.అయితే చనిపోయే ముందురోజు నాగార్జునకు హరికృష్ణ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.ఈ మద్య జరిగిన ఒక ఫంక్షన్ లో నాగార్జున హరికృష్ణ మీద ఉన్న ప్రేమను ఎన్టీఆర్ తో పంచుకున్నాడు కూడా.కానీ నాగార్జున వెళ్లి కలిసేలోపే హరికృష్ణ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. పలువులు సినీ ప్రముఖులు రాజకీయనాయకులు ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు.మరి మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే నాగార్జున చేసిన ట్వీట్ గురించి అలాగే వారిద్దరి మద్య ఉన్న బంధం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.