అర్థరాత్రి బాలయ్య ఫోన్ ఎన్నికల ప్రచారానికి రమ్మని అడిగితే ఎన్టీఆర్ చెప్పిన సమాధానం విని షాక్ తిన్న బాలయ్య

586

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నామినేషన్ ఉపసంహరణకు గడువు గురువారంతో ముగియనుంది. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.ప్రతిపక్షంనేత వైఎస్ జగన్ ప్రచారజోరు పెంచారు. తన ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగడుతూ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌సభకు పోటీచేసిన వైఎస్ విజయలక్ష్మీ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తన కుమారుడు జగన్‌కు తోడుగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మీ ప్రచారంలోకి దిగనున్నారు. గురువారం నుంచి ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.అలాగే జనసేనకు సపోర్ట్ గా కొందరు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి కూడా కొందరు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.

Image result for bala krishna and ntr

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు నందమూరి బాలకృష్ణ. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బాలయ్యకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకం అవుతున్నారు.అయినా కానీ హిందూపూర్ టీడీపీ నాయకులలో ఏదో లోటు కనపడుతుంది. అందుకే ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలవమని బాలయ్యతో చెప్పారంట. దాంతో ప్రచారానికి రమ్మని బాలయ్య ఎన్టీఆర్ కు ఫోన్ చేశాడంట. దానికి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా..

ఈ క్రింది వీడియో చూడండి

తాతగారు పార్టీ పెట్టినప్పటినుంచి నాకు ఊహ తెలిసినప్పట్టినుంచి నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని ప్రేమ ఉంది. అందుకే నేను ఎన్నోసార్లు పార్టీ తరుపున ప్రచారం చేశాను. కానీ నాన్నగారు చనిపోకముందు నాకు నాన్నకు ఒక సంభాషణ జరిగింది. నువ్వు సినిమాలలో బాగా రాణిస్తున్నావు. ఇంకా బాగా రాణించాలి. ఇప్పుడే నువ్వు వేరే విషయానికి డైవర్ట్ అవ్వొద్దు అని నాన్నగారు చెప్పారు. అందుకే కొన్నేళ్ల పాటు రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండాలని అనుకున్నా. నేను రాలేను బాబాయ్ అని బాలయ్యతో ఎన్టీఆర్ అన్నాడంట. అయితే ఎన్టీఆర్ రాకపోడానికి ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటున్నారు. రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమాకే డేట్స్ మొత్తం ఇచ్చేశాడు. ఇప్పట్లో ఖాళీ సమయం దొరికే అవకాశం లేదు కాబట్టి రాలేకపోతున్నాడు అని కొందరు అంటున్నారు. మొత్తానికి బాలయ్యతో ఎన్టీఆర్ అన్న ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి బాలయ్యతో ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి అలాగే ఏపీ ఎన్నికల గురించి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.