దారుణంగా మోసపోయి రోడ్డు మీద పడ్డ హీరోయిన్ రజని పరిస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లే

747

సినీ రంగంలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. రంగుల మాయా ప్రపంచంలో ఉన్నత స్థితిలో రాణించేది కొందరైతే,అధః పాతాళానికి చేరేది కొందరు అని చెప్పాలి. ఇక సమాజ సేవలో నిమగ్నమయ్యేవాళ్ళు కొందరున్నారు. మరికొందరు తమ హాబీని నెరవేర్చుకోడానికి ఎలాంటి పనైనా చేస్తారు. ఇలా ఎన్నో వింతలూ విడ్డూరాలు ఉంటాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఆయా సమయాల్లో వచ్చే హీరోలకు అనుగుణంగా హీరోయిన్స్ ని కూడా ఎంపికచేస్తుంటారు. ఆ విధంగా 1985 – 90 ల మధ్య ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ లో రజని ఒకరు.

Image result for హీరోయిన్ రజని

నాగార్జునతో మజ్ను,బాలకృష్ణతో సీతారామ కళ్యాణం,రాజేంద్ర ప్రసాద్ తో అహనా పెళ్ళంట వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న రజని బ్రహ్మముడి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు,తమిళ,మళయాళ, కన్నడ భాషల్లో ఓ వెలుగు వెలిగింది. అన్ని భాషల్లో కలిపి 150 సినిమాల్లో నటించిన రజని 1965 జులై 27న జన్మించింది. ఈమె అసలు పేరు శశికుమార్ మల్హోత్రా. అయితే దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఈమె పేరుని రజనిగా మార్చారు.తమిళ డైరెక్టర్ మణివణ్ణన్ తాను తీసే,ఇళమై కాలంగళ్ మూవీలో హీరోయిన్ కోసం వెతుకుతుంటే, చాకోలెట్ కొనుక్కోడానికి షాప్ కి వచ్చిన రజనిని చూసాడు. ఈ అమ్మాయి బాగుందని ఆమె తండ్రిని సంప్రదించడం ఆయన ఒకే చెప్పడంతో 12ఏళ్ళ వయస్సులోనే హీరోయిన్ అయింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇక దూసుకుపోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎన్ ఆర్ ఐ డాక్టర్ ప్రవీణ్ ని 1998లో రజని పెళ్ళిచేసుకుని, సినీ రంగం నుంచి హఠాత్తుగా తప్పుకుంది. అమెరికా వెళ్ళిపోయింది. రజనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు వున్నారు. పెద్ద కొడుకు మంచి స్విమ్మర్. జాతీయ అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం అవుతున్నాడు.అయితే తాను ఒకటి తలిస్తే,దైవం ఒకటి తలిచినట్లు భర్త పెట్టిన చిత్రహింసలు భరించలేక ముగ్గురు పిల్లలతో సహా ఇండియా వచ్చేసింది. శారీరకంగా,మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ భర్త, అత్తామామలపై కేసు వేసింది.తాను సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న ఇల్లుని తన భర్త బలవంతంగా అతడి తల్లిపేరిట రిజిస్టర్డ్ చేయించి, తనపై తప్పుడుకేసులు పెట్టించేందుకు కూడా పన్నాగం పన్నుతున్నారని ఆరోపించింది. కోర్టుకి కూడా ఈమె ఈమేరకు విన్నవించడంతో, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ రజనిపై ఎలాంటి కేసులు పెట్టరాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక పిల్లలతో సహా విడిగా ఉంటున్న రజని ఎలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధమని చెబుతోంది.ఆమె మంచి మంచి పాత్రలలో నటించి మనల్ని మళ్ళి అలరించాలని కోరుకుందాం. మరి రజని గురించి ఆమె నటన గురించి అత్త చేతిలో మోసపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.