రాజమౌళి కొడుకు పెళ్లిలో ఎన్టీఆర్ హల్‌చల్…ఆయన పెట్టుకున్న ఖరీదైన వాచీ ధర ఎంతో తెలిస్తే కళ్ళుతిరిగి పడిపోతారు..

413

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంతా సిద్ధమైంది. జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కొద్ది నెలల క్రితం కార్తికేయ వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ 30 ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫంక్షన్ లో ఇప్పటికే ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఆయన పెట్టుకున్న వాచ్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ వాచ్ కు ఉన్న స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందామా.

Image result for rajamouli son marriage ntr

పెళ్లి కోసం రాజమౌళి ఫ్యామిలీ ఇప్పటికే జైపూర్‌కు చేరుకొన్నారు. కార్తీకేయ, పూజా ప్రసాద్‌తోపాటు ఇరువర్గాల బంధువులు, కుటుంబ సభ్యులు జైపూర్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. తెలుగు సినీ ప్రముఖుల రాకతో జైపూర్ కోలాహాలంగా మారింది. కార్తీకేయ, పూజా వివాహం జైపూర్‌లోని విలాసవంతమైన హోటల్ జరుగనున్నది. పింక్ సిటీకి సమీపంలోని కుకాస్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి భారతీయ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ వివాహం కోసం ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, నాగార్జున, ఎన్టీఆర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు తమ కుటుంబాలతో సహా జైపూర్‌కు చేరుకొన్నారు. ఇంకా కొంత మంది శని, ఆదివారాల్లో అక్కడికి చేరుకొనే అవకాశం ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇప్పటికే పెళ్ళికి ముందు ఏర్పాటుచేసిన విందులో రాజమౌళి అనుష్క ప్రభాస్ డాన్స్ చేసి అలరించారు. వాళ్ళ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఇలా ఉండగా కార్తీకేయ, పూజా పెళ్లికి హాజరైన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ముఖ్యంగా ఆయన ధరించిన ఖరీదైన వాచీ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు.ఎన్టీఆర్ కార్డ్ మిల్లే మెక్‌లారన్ ఆటోమాటిక్ వాచీని ధరించారు. మార్కెట్లో దీని ధర 2,27,49,398 రూపాయలు.దీనిని చూసి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఎన్టీఆర్ గురించి ఆయన పెట్టుకొచ్చిన వాచీ ధర గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.