సుదీర్ కు పెళ్లి అయ్యిందా.. సాక్ష్యంతో అడ్డంగా బుక్కైన సుదీర్

322

సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించటమే కాకుండా టివిలో అనేక షోస్ కి యాంకర్ గా పని చేస్తూ బయట ఈవెంట్స్ కి కూడా యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. సుడిగాలి సుదీర్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. గత కొద్ది కాలంగా రేష్మితో వివాహం అవుతుందా? రేష్మిని సుదీర్ నిజంగా ప్రేమిస్తున్నాడా? అనే అంశాలను అనేక కార్యక్రమాలలో లీడ్ చేస్తూ రన్ చేస్తున్నారు. ఇప్పటికి ఢీ కార్యక్రమం హై TRP రేటింగ్స్ లో నడుస్తుంది అంటే సుదీర్,రేష్మిల టామ్ &జెర్రీ ప్లే తోనే నడుస్తుందని చెప్పాలి. ఏది ఏమైనా సుదీర్,రేష్మిల వ్యవహారం కేవలం కార్యక్రమం లీడ్ చేయటానికి మరియు ఎంటర్ టైన్ చేయటానికే తప్ప వారిద్దరి మధ్య ఏ వ్యవహారం లేదని ఇద్దరు కూడా సమయం వచ్చినపుడల్లా చెపుతూనే ఉంటారు.

Image result for sudheer marriage

సుదీర్ ఇంటిలో సుదీర్ తమ్ముడికి వివాహం జరిగిపోవటం కారణంగా సుదీర్ తల్లితండ్రులు సుదీర్ ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. దాంతో సుదీర్ తన అత్త కూతురిని పెళ్లి చేసుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా నిజం కాదని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో హల్చల్ చేస్తుంది. అది సుదీర్ పెళ్లినాటి ఫోటో. సుదీర్ కు పెళ్లి కాలేదని మనం అనుకుంటున్నాం కానీ సుదీర్ కు పెళ్లి అయ్యింది ఇదిగో సాక్ష్యం అంటూ ఎవరో ఒక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫొటోలో సుదీర్ పెళ్ళిబట్టలు వేసుకుని ఒక అమ్మాయికి దండ వేస్తున్న ఫోటో హల్చల్ చేస్తుంది.అది చూసి అందరు ఏమనుకుంటున్నారంటే.. సుదీర్ కు ఇంతకుముందే పెళ్లి అయ్యిందని.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే సుదీర్ చాలా సార్లు చాలా షోలలో నాకు ఇంకా పెళ్లి కాలేదు నన్ను అమ్మాయిల పిచ్చోడు అని అనకండి. నాకు పిల్లను కూడా ఎవ్వరు ఇవ్వడం లేదు అని అన్నాడు.ఆ మాటలు బట్టిచూస్తే పెళ్లి అవ్వలేదనే కదా అర్థం. మరి ఆ పెళ్లి ఎక్కడిది. ఎప్పుడు తీశారు ఎందుకు తీశారు. లేదా అవి మార్ఫింగ్ ఫొటోలా. ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే సుదీర్ నోరు విప్పాలి.మరి మీరేమంటారు. సుడిగాలి సుదీర్ గురించి అలాగే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సుదీర్ పెళ్లి ఫోటో గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.